అల్లుడి హ‌త్య‌కు మామ సుపారీ

హైదరాబాద్:సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నారాయ‌ణ రెడ్డి హ‌త్య కేసులో కొత్త‌కోణం వెలుగులోకి వ‌చ్చింది. నారాయ‌ణ‌ది పరువు హత్యగా తేల్చారు పోలీసులు. మృతుడి మామే ఈ ఘాతుకానికి పాల్ప‌డ్డాడ‌ని నిర్థారించాడు. కుమార్తె ప్రేమించి పెళ్లి చేసుకోవ‌డంతో భ‌రించ‌ని తండ్రి.. వీరిద్ద‌రిని ఇంటికి పిలిపించాడు. త‌న అల్లుడైన నారాయణరెడ్డిని .. మామ‌ వెంకటేశ్వర్ రెడ్డి సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో వెల్లడయింది. ఘ‌నంగా పెళ్లి చేస్తానంటూ.. ఢిల్లీలో ఉన్న కుమార్తె, అల్లుడిని ఇంటికి పిలిపించి కుమార్తెను గృహనిర్భందించి, వేరే పెళ్లి చేసుకోవాలని యువతిపై ఒత్తిడి చేయడంతో అందుకు ఆమె నిరాకరించింది. ఈనేప‌థ్యంలో.. త‌న‌ కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్న నారాయణ రెడ్డిని హత్య చేయాలని యువతి తండ్రి భావించాడు. దీంతో.. శ్రీనివాస్ రెడ్డి, ఆశిక్, కాశీలకు వెంకటేశ్వరరెడ్డి ఐదు లక్షల సుపారీ ఇచ్చాడు.ప్లాన్ ప్ర‌కారం 27న కేపీహెచ్‌బీ రూమ్‌ నుంచి నారాయణరెడ్డిని కారులో ఎక్కించుకొని మద్యంలో మత్తు మందు కలిపి టవల్‌తో మెడకు ఉచ్చుగా వేసి సుపారీ గ్యాంగ్‌ హత మార్చారు. మృత‌దేహాన్ని జిన్నారం అటవీ ప్రాంతంలో మృతదేహాన్ని గుర్తుపట్టకుండా ఉండేందుకు పెట్రోల్‌ పోసి తగలబెట్టారు. దీంతో.. ఈ ఘటనకు సంబందించిన కాల్‌డేటా ఆధారంగా పోలీసులు నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా.. యువతి తండ్రి వెంకటేశ్వరరెడ్డిని గిద్దలూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడు.. నిందితులు ప్రకాశం జిల్లా పొదలకుంట్లపల్లికి చెందిన వారుగా గుర్తించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article