కోనసీమలో అదుపుతప్పిన ఆందోళన
- కోనసీమలో అదుపుతప్పిన ఆందోళన
*జిల్లా ఎస్పీ వాహనంపై రాళ్లు దాడి
అమలాపురం:కోనసీమలో అందోళన అదుపుతప్పింది. కోనసీమ జిల్లా పేరు మార్చవద్దంటూ కోనసీమ సాధన సమితి ఆందోళనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆందోళనను ఆడ్డుకునేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నం ప్రయత్నం చేసారు. పోలీసులను తప్పించుకుని కలెక్టరేట్ ముట్టడికి భారీగా ఆందోళనకారులు చేరుకున్నారు. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి అరెస్ట్ చేసారు. దాంతో వారు పోలీసులపై తిరగపడ్డారు. పోలీసులపై రాళ్లు దాడికి దిగారు. జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి వాహనంపై రాళ్ల దాడి జరిగింది. రాళ్లు దాడిలో ఎస్పీ గాన్ మాన్ కు గాయం అయింది. ఆందోళనకారులను చెదరగోడుతూ అమలాపురం డిఎస్పీ మాధవ రెడ్డి సొమ్మసిల్లిపడిపోయారు.
- Advertisement -
- Advertisement -