గోల్డ్ టైమ్ పిక్చర్స్ ఉండిపోరాదే

GOLD TIME PICTURES UNDEPORADHE MOVIE LAUNCH
గోల్ట్ టైమ్ పిక్చర్స్ బ్యానర్ పై శ్రీమతి సత్యప్రమీల కర్లపూడి సమర్పణలో డా.లింగేశ్వర్ నిర్మాతగా నవీన్ నాయిని దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఉండిపోరాదే. 15 సంవత్సరాల క్రితం జరిగిన యాదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న దృశ్యకావ్యం ఉండిపోరాదే. మనసుని హత్తుకొనే సన్నివేశాలు, ఊహించని ముగింపుతో కన్నీరు తెప్పించే విధంగా ఈ సినిమా ఉంటుంది. రాజమండ్రి, మైసూర్, హైదరాబాద్ ప్రాంతాల్లో ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. మిగిలిన 20 శాతం హైదరాబాద్, అండమాన్ దీవుల్లో జరిపే చిత్రీకరణతో సినిమా పూర్తవుతుంది. రామ్ సుంకర, సబ-సుబ్బు ఫైట్ మాస్టర్ల నేతృత్వంలో భారీ ఫైట్స్ చిత్రీకరించారు. సాబు వర్గీస్ మ్యూజిక్ డైరెక్టర్ గా… చిత్ర, రాహుల్ నంబియార్, రంజిత్, యాజిన్ నజీర్… మొదలగు ప్రముఖ గాయనీ గాయకులతో రికార్డింగ్ పూర్తయింది. త్వరలో ఆడియోను రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. జూన్ నెలలో చిత్రం రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ప్రధాన పాత్రల్లో కేదార్ శంకర్, అజయ్ ఘోష్, సత్య కృష్ణన్, సుజాత, విఠల్, నూకరాజు, రజాక్, సిద్ధిక, రూపిక నటిస్తున్నారు.
మాట‌లు– సుబ్బ‌రాయుడు బొం పెం
పాట‌లు– సుద్దాల అశోక్ తేజ్‌, చంద్ర‌బోస్‌, రామాంజ‌నేయులు
సంగీతం– సాబు వ‌ర్గీస్‌
కెమెరామెన్‌– శ్రీను విన్నకొట‌
స్టంట్స్‌– రామ్ సుంక‌ర‌, సబ-సుబ్బు
కొరియోగ్రాఫ‌ర్‌– న‌రేష్ ఆనంద్‌
ఎడిటర్ – జె.పి
పబ్లిసిటీ డిజైనర్ – శివప్రసాద్ ఘనాల
వి.ఎఫ్.ఎక్స్ – సతీష్ కొత్తంగి
కొ-డైర‌క్ట‌ర్‌– శ్రీహ‌రి కొట సుధాక‌ర్‌
ఎగ్జిక్యూటివ్ మేనేజ‌ర్‌– కొండ నాయుడు వలిశెట్టి
నిర్మాత‌.. డా.లింగేశ్వ‌ర్ ఎం.కామ్
ద‌ర్శ‌క‌త్వం.. న‌వీన్ నాయని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *