వేములవాడ వద్ద కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన

UNDER CONSTRUCTION DAM  COLLAPSED IN VEMULAVADA

తెలంగాణా రాష్ట్రంలో భారీ వాహనాల రాకపోకల కోసం ఓ వాగుపై నిర్మిస్తున్న వంతెన కూలిపోవటం పలు విమర్శలకు కారణం అవుతుంది. ఇటీవల కురుస్తున్న వర్షాలతో వస్తున్న కాస్త నీటి ప్రవాహానికే కుప్ప కూలిపోవడం సంచలనమైంది. ఇంకా నిర్మాణం పూర్తి చేసుకోని వంతెన ఈరోజు ఉదయం హఠాత్తుగా నేలమట్టమయ్యింది. వివరాల్లోకి వెళితే… తెలంగాణ రాష్ట్రం రాజన్నసిరిసిల్లా జిల్లా వేములవాడ మండల కేంద్రానికి సమీపం నుంచి ప్రవహిస్తున్న మూలవాగుపై ఈ వంతెన నిర్మిస్తున్నారు. 28 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఈ వంతెన నిర్మాణాన్ని నాలుగేళ్ల క్రితం ప్రారంభించారు.

వేములవాడ బస్టాండ్ నుంచి తెలంగాణలోని అతిపెద్ద పుణ్యక్షేత్రం వేములవాడ ఆలయానికి రాకపోకల నిమిత్తం ఈ వంతెన నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఉన్న వంతెన పూర్తిస్థాయిలో అవసరాలు తీర్చలేకపోవడంతో మరో రెండు వంతెనల నిర్మాణం ప్రతిపాదించారు. ఒకదాని నిర్మాణం పూర్తికాగా దాన్ని ప్రారంభించారు. రెండో వంతెన పనులు కొన్నాళ్లుగా నత్తనడకన సాగుతుండడంతో ఇప్పటికే తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వంతెనే ఏకంగా కూలిపోవడంతో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని స్థానికులు మండిపడుతున్నారు .

మంత్రులకు ఝలక్ ఇస్తున్న గులాబీ ఎమ్మెల్యేలు 

విక్రమ్ పై ఆశలు అడియాశలేనా?

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article