అద్భుత శిల్ప సంపదకు నెలవైన రామప్ప ఆలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ సంస్కృతి హోదా దక్కడం భారతీయులందరికీ, ప్రత్యేకంగా తెలంగాణకు గర్వకారణమని దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మన రామప్పకు అంతర్జాతీయ ఖ్యాతి దక్కడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాకతీయ శిల్పకళా వైభవానికి దక్కిన అరుదైన గౌరవమని పేర్కొన్నారు.