United Nation Report On CAA
ఇండియాలో సీఏఏ మంటలు ఇంకా చల్లారలేదు . ఇక ఇదే సమయంలో ఐక్య రాకయ సమితి సీఏఏపై భారత్లో జరుగుతున్న ఆందోళనలపై లెజిస్లేటివ్ రిపోర్టును విడుదల చేసింది . ముస్లిం సామాజిక వర్గంపై సీఏఏ తీవ్ర ప్రభావం చూపుతుందంటూ యూఎన్వో అంతర్జాతీయ మత స్వేచ్ఛా కమిషన్ ప్రకటన విడుదల చేసింది. సీఏఏ, ఎన్ఆర్సీలు రెండూ హిందూత్వ భావజాలం నుంచే పుట్టుకొచ్చాయని అభిప్రాయపడింది. ఫ్యాక్ట్ షీట్ లో అనేక అంశాలను ప్రస్తావించింది యూఎన్ఓ. సీఏఏ పేరుతో ముస్లింలను ఎన్ఆర్సీ నుంచి తొలగించే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. అంతే కాదు వీరు ఉండేందుకు చోటు లభించకపోవచ్చని లేదా సుదీర్ఘంగా నిర్బంధంలో ఉంచే అవకాశం ఉందని సీఏఏ పై ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మత స్వేచ్ఛా కమిషన్ విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్లో పొందుపర్చింది. అంతే కాదు బీజేపీ నేతలు పలు సందర్భాల్లో మాట్లాడిన మాటలను కూడా ఈ నివేదికలో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మత స్వేచ్ఛా కమిషన్ నివేదికలో పొందుపర్చింది. ఇక ఈ రిపోర్ట్ తో భారత దేశంలో మరింత ఆందోళనలు పెరిగే అవకాశం ఉంది. ఐక్య రాజ్య సమితి ఈ తరహా నివేదిక ఇవ్వటం నిజంగా భారత సర్కార్ కి షాక్ అనే చెప్పాలి .