వారిని తెలంగాణా పోలీసుల్లా ఎన్కౌంటర్ చెయ్యండి

Unnao Rape Victim’s Father Demanded

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ దిశ కేసులో నలుగురు నిందుతులని పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు . ఇక ఈ ఘటనతో ఉన్నావ్ రేప్ బాధితురాలి తండ్రి తన బిడ్డ మృతికి కారణమైన వారిని ఎన్కౌంటర్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.దిశ కేసులో  త్వరగా న్యాయం జరగటంతో ఇప్పుడు అత్యాచార బాధితులు తమ కేసుల్లో నిందితులను ఎన్కౌంటర్ చెయ్యమని కోరుతున్నారు. ఇలా చేస్తేనే  ఇక పై ఇంకెవరు ఇలాంటి దారుణాలకు పాల్పడకుండా ఉంటారని చెప్తున్నారు.
ఇకపోతే గత కొన్ని రోజుల ముందు  ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ బాధితురాలిపై 2018 డిసెంబర్ లో అత్యాచారం జరిగింది. ఈ కేసులో  అరెస్టయిన నిందితులు  నవంబర్ 30న బెయిల్ పై విడుదలయ్యారు. బాధితురాలిపై కక్ష పెంచుకున్న నిందితులు పక్కా ప్లాన్ తో గురువారం కోర్టుకు వెళుతుండగా అడ్డుకుని కిరోసిన్ పోసి నిప్పంటించారు. దీంతో 90 శాతం కాలిన గాయాలతో హాస్పిటల్ లో ఆమెని చేర్పించగా .. హాస్పిటల్  లో చేరిన ఆమె చికిత్స పొందుతూ  గుండెపోటు రావడంతో శుక్రవారం రాత్రి మృతి చెందింది. దిశ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుండగానే ..ఉన్నావ్ అత్యాచార బాధితురాలు చనిపోవడం తో దేశం మొత్తం అట్టుడుకుతోంది.

ఈ నేపథ్యంలో మీడియా తో మాట్లాడిన ఉన్నావ్ బాధితురాలి తండ్రి ..మాకు హైదరాబాద్ తరహా న్యాయం కావాలంటూ  – నిందుతులని ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేసారు.  మరోవైపు ఉన్నావ్ బాధితురాలి కుటుంబానికి బెదిరింపులు వస్తున్నట్లు ఆమె తండ్రి చెప్పాడు. గ్రామంలో వారు చెప్పిందే వేదం, చేసిందే చట్టం అన్న రీతిలో వ్యవహారం ఉందని, ఎవరూ వారికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం చేయరని చెప్పాడు. ఇదిలా ఉంటే నిందితుల బంధువులు తమను బెదిరిస్తున్నారని చెప్పాడు బాధితురాలి మామ. కేసును విత్‌డ్రా చేసుకోకపోతే దుకాణంను కాల్చేస్తామని చెబుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులకు తాను ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు.తమకు హైదరాబాద్ పోలీసులు ఎలా న్యాయం చేశారో అలాగే న్యాయం కావాలని వారిని ఎన్కౌంటర్ చెయ్యండి అని కోరుతున్నారు బాధితురాలి తండ్రి.

Unnao Rape Victim’s Father Demanded,Uttar pradesh, Unnao victim, set ablaze, died , Safdarjung Hospital in Delhi, cardiac arrest, 90 per cent burns

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *