Upper cast poor peoples are allotted 10 Percentage Reservation… ఒప్పుకోమంటున్న ఎంఐఎం
ఆర్ధికంగా వెనుకబడిన అగ్ర కులాల వారికి 10 శాతం రిజర్వేషన్లు పెంచుతూ కేంద్ర కేబినేట్ ఆమోదించింది. విద్య ఉద్యోగాల్లో ఆర్ధికంగా వెనుకబడి ఉన్న అగ్రకులాల వారికి ఈ రిజర్వేషన్లు వర్తించనున్నాయి. ప్రస్తుతం ఉన్న 50 శాతం రిజర్వేషన్లను 60 శాతానికి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయనుంది.అగ్రవర్గ కులాల వారికి రిజర్వేషన్లు కల్పించాలని దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలల్లో ఆందోళనలు నిర్వహించారు. గుజరాత్ లో పటేల్ లు తమ రిజర్వేషన్ల కోసం చేసిన పోరాటం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తెలంగాణలో రెడ్లు తమకు రిజర్వేషన్లు కల్పించాలని పోరాడారు. రెడ్డి జాగృతి తరపున అనేక ఉద్యమాలు నిర్వహించారు. ఒకానొక దశలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. రెడ్డి జాగృతి తరపున అసెంబ్లీ ముట్టడి కూడా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లో కాపులు కూడా తమ రిజర్వేషన్ల పెంచాలని పోరాటం చేశారు. మహారాష్ట్ర, రాజస్థాన్ లలో కూడా ఈ డిమాండ్ ఉంది. దీంతో కేంద్ర కేబినేట్ ఆర్ధికంగా వెనుకబడిన అగ్రకులాల వారికి రిజర్వేషన్లు పెంచాలని నిర్ణయం తీసుకుంది. మంగళవారం లోక్ సభలో అగ్రవర్ణాల రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఐదెకరాలకంటే ఎక్కవ పొలం ఉన్నవారు ఈ రిజర్వేషన్లకు అనర్హులు. ఏడాదికి 8 లక్షల లోపు ఇన్ కం ఉన్న వారే అర్హులు. 1000 చ.మీటర్ల ఇల్లు ఉంటే రిజర్వేషన్లకు అర్హులు కారని కేంద్రం స్పష్టం చేసింది. ఈబిసిలకు విద్య ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నారు. పార్లమెంటులో బిజెపికి మెజార్టీ సభ్యులు ఉండడంతో బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉంది.
అగ్రవర్ణాల పేదల కోసం రిజర్వేషన్ ల విషయంలో కేంద్రం తీసుకున్నటువంటి సంచలనాత్మక నిర్ణయాన్ని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ తప్పు బట్టారు. ఉన్నత వర్గాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాలంటూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం తప్పు అని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. అంతేకాకుండా కేబినెట్ నిర్ణయంపై సోషల్ మీడియాతో స్పందించిన ఒవైసీ ‘దళితులకు జరిగిన చారిత్రక అన్యాయాన్ని సరిచేసేందుకు రిజర్వేషన్లను తీసుకొచ్చారు. పేదరికాన్ని అరికట్టడానికి చాలా పథకాలు, కార్యక్రమాలు తీసుకునిరావొచ్చు… కానీ. రిజర్వేషన్లు అన్నవి న్యాయానికి ఉద్దేశించినది. ఆర్థిక కారణాల ఆధారంగా రిజర్వేషన్లను ఇవ్వలేం’ అని ఒవైసీ స్పష్టం చేశారు. ఇలాంటి అనవసరమైన రాజకీయాలు మాని పేద ప్రజలకి ఉపయోగపడే పథకాలను ప్రవేశపెట్టాలని ఒవైసీ కేంద్రానికి తెలిపారు. అయితే ఇది తప్పు నిర్ణయమని తాము దీనికి ఒప్పుకోమని మజ్లీస్ పార్టీ నేత అసద్ తప్పు పడుతూ సోషల్ మీడియా లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వివాదాస్పదం అవుతుంది.
For more new updates Click Here
Subscribe to TSNEWS.TV