ఇరాన్, అమెరికన్ యుద్ధంతో భారత్ బయపడుతుందా..ఎందుకు?

US-Iran War Impacts On India

ప్రస్తుతం ప్రపంచ దేశాలు యుద్ధ భయంలో ఉన్నాయి.  గల్ఫ్ లో యుద్దవాతావరణం నెలకొన్నది.  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు యుద్ధ భయాన్ని కలిగించే విధంగా ఉన్నాయి.  అసలే ఆర్ధిక మాంద్య పరిస్థితులతో ప్రపంచం అతలాకుతలం అవుతుంటే ఇదే సమయంలో యుద్ధం ప్రపంచ దేశాలను వణికిస్తుంది. గల్ఫ్ లో ఏ క్షణంలో అయినా యుద్ధం సంభవించే అవకాశం పుష్కలంగా ఉండటంతో ప్రపంచం యావత్తు భయపడుతున్నది.  ముఖ్యంగా ఇండియా.  ఎందుకంటే, ఇండియా ఎక్కువగా చమురును ఇరాన్, సౌదీ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది.  ఇరాన్ తో అమెరికా యుద్ధం చేసేటట్టయితే… ఇరాన్ అమెరికన్ సైన్యంతో పాటుగా, అటు సౌదీపై కూడా దాడులు చేస్తుంది అనడంలో సందేహం అవసరం లేదు.  బాగ్దాద్ లో ఇరాన్ సైన్యంలోని రివల్యూషనరీ గార్డ్స్ శక్తివంతమైన కమాండర్ సులేమానిని ని హతమార్చింది అమెరికా సైన్యం.  అక్కడితో ఆగకుండా ఇరాక్ లోని తాజీ పట్టణంలో ఇరాన్ కు చెందిన వైద్య కాన్వాయ్ పై అమెరికా దాడులు చేసింది.  ఈ దాడుల్లో పలువురు మరణించినట్టు తెలుస్తోంది.  దీంతో ఇరాన్ రగిలిపోతుంది.  ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది.  అయితే, ఇరాక్ లో ఉన్న అమెరికా ఆస్తులపై దాడులు చేస్తే ఇరాన్ కు బుద్ధిచెప్తామనీ అంటోంది అమెరికా.  రెండు దేశాల పరస్పర హెచ్చరికలతో పశ్చిమాసియా ప్రాంతం అట్టుడికిపోతున్నది.  ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

US-Iran War Impacts On India,america, iran , war , army chief, khasim sulemani, died, gulfcountries, trump,US-Iran conflict

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *