ప్రభుత్వ వైద్య సేవలను ఉపయోగించుకోవాలి

హైదరాబాద్: ప్రభుత్వ వైద్య సేవలను ఉపయోగించుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం నాడు 30 లక్షల రూపాయల విలువైన సీఎంఆర్ ఎఫ్ చెక్కులను 66 మంది లబ్ధిదారులకు మంత్రి పంపిణీ చేసారు. మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరింత మెరుగైన ప్రభుత్వ వైద్య సేవలు అందిస్తున్నాం. ఎమ్మారై, సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్ వంటి అత్యాధునిక పరికరాలు అందుబాటులో వచ్చాయి. వేలాది రూపాయల విలువైన టెస్ట్ లు ప్రభుత్వ హాస్పిటల్ లో ఉచితంగా అందుతున్నాయి. అవయవాల మార్పిడి ఆపరేషన్ లు సైతం చేసే స్థాయికి అభివృద్ధి ప్రభుత్వ హాస్పిటల్స్ సాధించాయి. హాస్పిటల్స్ లో పేషంట్స్ తో పాటు సహాయకులుగా వచ్చిన వారికి 5 రూపాయల కు భోజనం అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వం ది అని అన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article