కేసీఆర్ కు ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాల్

156
Uttam Kumar Reddy Challenge To CM Kcr
Uttam Kumar Reddy Challenge To CM Kcr

Uttam Kumar Reddy Challenge To CM Kcr

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాంగ్రెస్ ఎంపీ ,టీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ పౌరసత్వ సవరణ చట్టంపై గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తున్నారని, దమ్ముంటే ఈ అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా సాగుతున్న మునిసిపల్  ఎన్నికలకు సంబంధించిన ప్రచారాన్ని ఆయన నల్గొండలో చేపట్టారు. పట్టణంలోని పాతబస్తీలో ప్రచారం నిర్వహించిన ఆయన  గులాబీ బాస్ కు సవాలు విసిరారు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పెద్దపీట వేసిందని.. పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని మండిపడ్డారు.
ఓపక్క మజ్లిస్ తో చెట్టాపట్టాలు వేసుకు తిరిగే కేసీఆర్ కేంద్రంలో మోడీకి కోపం రాకుండా ఉండేందుకు పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా వ్యవహరించారు. అందుకు భిన్నంగా రాష్ట్రంలో మాత్రం మజ్లిస్ తో స్నేహితుడిగా ఉన్నారు. ఇలాంటి వేళ మోడీకి కోపం వచ్చేలా కేసీఆర్ చేత తీర్మానం చేయిస్తే అది తెలంగాణ కాంగ్రెస్ కు విజయంగా మారుతుంది. ఈ వ్యూహంతోనే కేసీఆర్ ను  పదేపదే ఈ వ్యవహారంపై రెచ్చగొడుతున్నారు . ఇక తాజాగా  ఉత్తమ్  కుమార్ రెడ్డి చేసిన సవాలుకు గులాబీ బాస్ ఎలా రియాక్ట్ అవుతారన్నది వేచి చూడాలి.

Uttam Kumar Reddy Challenge To CM Kcr,uttam kumar reddy, challenge, cm kcr, municipal elections, CAA, congress , trs party , MIM

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here