యూవీ జాక్ పాట్

74

యూవీ నిర్మాణ సంస్థ చిన్న సినిమాతో బడా జాక్ పాట్ కొట్టేసింది. దర్శకుడు మేర్లపాక మురళి పర్యవేక్షణలో నిర్మించిన సినిమా ఏక్ మినీ కథ ను ఓటిటికి అమ్మేశారని సమాచారం. ఇప్పట్లో థియేటర్లు తెరుచుకోవడం అసాధ్యమనే క్లారిటీ రావడంతో ఓటిటికి అమ్మేశారని తెలిసింది. రేటు ఎంత లేదన్నా తొమ్మిది కోట్లకు అటుఇటుగా వచ్చిందట. సంతోష్ శోభన్ హీరోగా తీసిన ఈ సినిమా చిన్న సినిమా చాలా తక్కువ బడ్జెట్ తో తయారైంది. కాస్త అడల్డ్ కామెడీ టచ్ వున్న సబ్జెక్ట్ ఇది. దీన్ని అమెజాన్ ఒరిజినల్స్ కింద ఇచ్చినట్లు తెలుస్తోంది. అంటే ఇంక థియేటర్ లోకి రాకపోవచ్చన్నమాట. మే నెలాఖరులో ఈ సినిమా ఓటిటిలో విడుదలయ్యే అవకాశముంది. దీని ద్వారా కనీసం అయిదు కోట్లకు పైగానే యువికి లాభం వుంటుందని టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here