నైజాంలో యూవీ చేతికి సైరా

UV CREATIONS TAKE SYRAA

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సైరా చిత్రం పంపిణీ హక్కులు ఒక్కటొక్కటిగా ఖాయమవుతున్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం నైజాం రైట్స్ ను ప్రముఖ సంస్థ యూవీ క్రియేషన్స్ దక్కించుకున్నట్టు సమాచారం. ఇందుకోసం రూ.30 కోట్లు చెల్లించడానికి ఆ సంస్థ అంగీకారం తెలిపి ఒప్పందం ఖాయం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. యూవీ సంస్థ హక్కులు తీసుకున్నప్పటికీ, పంపిణీ బాధ్యతలను మాత్రం ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు అప్పగించినట్టు చెబుతున్నారు. నైజాంలో సైరా సినిమాకు రూ.30 కోట్లు అంటే పర్వాలేదనే అంటున్నారు. ఇటీవల విడుదలైన మహేష్ బాబు మహర్షి సినిమాకు ఈ ప్రాంతంలో రూ.26 కోట్ల వరకు వచ్చింది. దీనిని పరిగణనలోకి తీసుకునే యూవీ సంస్థ రూ.30 కోట్ల వరకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఇక ఉత్తరాంధ్ర హక్కులను క్రాంతి పిక్చర్స్ అధినేత క్రాంతిరెడ్డి రూ. 14.50 కోట్లకు ఓకే చేసినట్టుగా వార్తలొస్తున్నాయి. అయితే, దాదాపు డీల్ ఓకే అయిపోయిందనుకున్న తరుణంలో దిల్ రాజు తెర పైకి వచ్చినట్టు సమాచారం. రూ.15 కోట్లు ఇస్తానని ఆయన సంప్రదింపులు ప్రారంభించినట్టు తెలిసింది. దీంతో నిర్మాత రామ్ చరణ్ ఏం చేయాలా అనే అంశంపై సమాలోచనలు జరపుతున్నట్టు తెలుస్తోంది.

TELUGU CINEMA

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article