ఇంజనీర్లకు సువర్ణావకాశం

VACANCIES IN ENGINEERING

  • కేంద్ర ప్రభుత్వంలో ఇంజనీరింగ్ ఉద్యోగాలు
  • నోటిఫికేషన్ విడుదల చేసిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్

ఇంజనీర్లకు చక్కని అవకాశం వచ్చింది. ఇంజనీరింగ్ పట్టభద్రులతోపాటు డిప్లమోలు చేసినవారికి కేంద్రం ఉద్యోగావకాశం కల్పించనుంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలో జూనియర్‌ ఇంజనీర్ల పోస్టుల నియామకాల కోసం స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తుల ప్రక్రియ కూడా మొదలైంది. సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, క్వాంటిటీ సర్వేయింగ్‌ అండ్‌ కాంట్రాక్ట్‌ బ్రాంచీల్లో డిప్లమో, సంబంధిత కోర్సుల్లో ఇంజనీరింగ్‌ చదివినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్షలో విజయం సాధించి, ఉద్యోగం పొందినవారు కేంద్ర జలసంఘం, సీపీడబ్ల్యూడీ, మిలటరీ ఇంజనీరింగ్‌ సర్వీసు, సరిహద్దు రహదారుల సంస్థ, నేషనల్‌ టెక్నికల్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ తదితర సంస్థల్లో పనిచేసే అవకాశం లభిస్తుంది. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది. ఎంపికైనవారికి దాదాపు రూ.35,400 నుంచి రూ.1,12,400 స్కేలులో రూ.60 వేల నుంచి రూ.65 వేల వేతనం లభిస్తుంది. ఆసక్తి ఉన్నవారు  http://ssconline.nic.in  వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష రుసుము రూ.100 ఎస్‌బీఐ ఛలానా, నెట్‌ బ్యాంకింగ్‌, క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డు ద్వారా చెల్లించాలి. మహిళా అభ్యర్థులు ఎస్‌సీ, ఎస్‌టీ, వికలాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కేటగిరీల వారికి పరీక్ష ఫీజులో మినహాయింపు ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు ఆఖరి తేదీ ఈనెల 25.

NATIONAL NEWS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article