సూపర్‌ స్ప్రెడర్లకు వ్యాక్సీన్

సూపర్‌ స్ప్రెడర్లకు వాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఖమ్మం నగరంలోనే శాంతినగర్ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ తీరును రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు. ఆయా కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేసినట్లు.. అందరికి వ్యాక్సినేషన్ అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

వ్యాక్సినేషన్ కోసం అదనపు సిబ్బందిని కేటాయించినట్లు పేర్కొన్నారు. ప్రతి కేంద్రంలో వ్యాక్సినేషన్ రూం, వెయింటింగ్ రూం, అబ్జర్వేషన్ రూం లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎక్కడ ఇబ్బంది కలుగకుండా చూడాలని ఎప్పటికప్పుడు కోవిడ్ కేంద్రాల వివరాలు సేకరించాలని జిల్లా వైద్యాధికారి మాలతికి సూచించారు. వారి వెంట మేయర్ పునుకొల్లు నీరజ గారు, జిల్లా కలెక్టర్ RV కర్ణన్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, సుడా చైర్మన్ విజయ్, DM&HO మాలతి, కార్పొరేటర్లు కమర్తపు మురళి, మందడపు మనోహర్, మాక్బూల్, వైద్య సిబ్బంది ఉన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article