ఎల్బీ నగర్లో సూపర్ షాపింగ్ కాంప్లెక్స్

Vaishnavi Onyx One @ LB Nagar

ప్రముఖ నిర్మాణరంగ సంస్థ  వైష్ణవీ ఇన్ఫ్రాకాన్ నిర్మించిన మరో అధ్భుతమైన “కమర్షియల్ కాంప్లెక్స్”.. వైష్ణవీ ఒనిక్స్ వన్. ఎల్ బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ వెళ్ళే మార్గంలో వైష్ణవీ ఒనిక్స్ వన్ ప్రతిఒక్కరినీ ఇట్టే ఆకట్టుకుంటోంది. ఎన్నో ప్రత్యేకతలు కలిగి డాక్టర్స్ కాలని (ఎల్.బి.నగర్) ఏరియాకి వన్నెవన్నె తెచ్చేలా నిర్మించబడింది. లొకేషన్ పరంగా జాతీయ రహదారి పై ఉంటూ, మెట్రో రైలు మార్గం కావడం వల్ల ఈ ‘ప్రాజెక్టు’ కు మరింత ప్రాధాన్యత వచ్చింది.

17 ఏళ్ళ నుండీ నాణ్యతా, వినియోగదారుల నమ్మకమే శ్వాసగా… రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ కాంప్లెక్స్ అందిస్తున్న వైష్ణవీ ఇన్ఫ్రాకాన్ సుధీర్ఘ ప్రయాణంలో వైష్ణవీ ఒనిక్స్ వన్ మరో మైలురాయి అని చెప్పొచ్చు. నాణ్యతతో పాటు ఎప్పటికప్పుడు కొత్తదనం.. ఇంకా… సౌకర్యవంతమైన నిర్మాణాలను అందించే ‘తపనలో’ భాగంగా వైష్ణవీ ఒనిక్స్ వన్ కాంప్లెక్స్ ని నిర్మించింది. సాధారణమైన “కమర్షియల్ కాంప్లెక్స్”కు భిన్నంగా ప్రాజెక్టులోని ప్రతిభాగం ఎలివేట్ అయ్యే విధంగా బిల్డింగ్ ని “35” ఫీట్ల సెంట్రల్ టాట్ లాట్  ని వదులుతూ “యు” షేప్ లో నిర్మించడం జరిగింది. బిల్డింగ్ లోపల ‘క్లియర్ స్పాన్” వుండేందుకుగాను తక్కువ సంఖ్యలో పిల్లర్స్ ఉండేలా మరియు నిర్మాణం ధృడంగా వుండేలా  పీటీ శ్లాబుల విధానంలో నిర్మించడం జరిగింది. ఎలివేషన్ కూడా ఆకర్షణీయంగా వుండేలా శ్రద్ధ తీసుకోవడం జరిగింది. వైష్ణవీ ఒనిక్స్ వన్ లో లీజింగ్ లో వున్న బ్రాండ్లు సైతం అన్నీ మంచి రెప్యూటెడ్ బ్రాండ్లన్నీ “చక్కగా, ఒక్క చోట చేరాయి.  సాధారణంగా ఒక కమర్షియల్ కాంప్లెక్స్ లో ఏదేని ఒక ‘వ్యాపార సంస్థ వల్ల గాని రిటైల్ బ్రాండ్ వల్ల గాని బిల్దింగ్ కి బ్రాండ్ పేరుతో ఫలాన బ్రాండ్ “కమర్షియల్ కాంప్లెక్స్” గా ముద్రపడుతుంది. కాని వైష్ణవీ ఒనిక్స్ వన్ కమర్షియల్ కాంప్లెక్స్ లో మాత్రం ఒకటి రెండు కాదు అన్నీ వేటికవే ప్రత్యేకంగా కుదిరాయి. రిలయన్స్ డిజిటల్స్, రిలయన్స్ ట్రెండ్స్, మినర్వా కాఫీ షాప్, బ్లూ ఫాక్స్, మినర్వా బ్యాంకెట్స్, బార్బీ క్యూ నేషన్ వంటి విశిష్ఠమైన బ్రాండ్లు ఇందులో ఆరంభమయ్యాయి.

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ 2019

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article