చిరంజీవి డేట్ లో వస్తోన్న పవన్ కళ్యాణ్ 

vakeel saab lock for aug 9
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. పాలిటిక్స్ నుంచి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీ అవుతూ.. అందరినీ ఆశ్చర్యపరిచాడు. కానీ అతని ఉత్సాహంపై కరోనా వైరస్ జల్లింది. దీంతో ఆల్రెడీ షూటింగ్ పూర్తయి వచ్చే నెలలో విడుదల కావాల్సిన పింక్ రీమేక్ వకీల్ సాబ్ కు పెద్ద దెబ్బ తగిలింది. విశేషం ఏంటంటే.. ఇన్నేళ్ల తన కెరీర్ లో పవన్ కళ్యాణ్ అత్యంత వేగంగా షూటింగ్ పూర్తి చేసిన సినిమా వకీల్ సాబ్ మాత్రమే. అంతే వేగంగా ఆడియన్స్ ముందుకు వస్తుందనుకున్న ఈ సినిమాకు కోవిడ్ 19 రూపంలో ఎదురు దెబ్బ తగిలింది.
ఇక మరోవైపు ఈ సినిమాతో పాటు క్రిష్ డైరెక్షన్ లో చేస్తోన్న విరూపాక్ష కూడా షూటింగ్ మొదలుపెట్టుకుంది. మొన్నటి వరకూ వినిపించినదాన్ని బట్టి ఈ మూవీ కూడా ఓ షెడ్యూల్ పూర్తయింది అన్నారు. అంటే పవన్ కళ్యాణ్ ఎంత వేగంగా వెళుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. విరూపాక్షలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తాడు పవన్ అంటున్నారు. ఇక పింక్ రీమేక్ వకీల్ సాబ్ లో ఒరిజినల్ కంటే తెలుగులో చాలా మార్పులు చేశారు. లాయర్ పాత్రకు హీరోయిజం కూడా ఆపాదించారు. పైగా పవన్ కు హీరోయిన్ ను కూడా సెట్ చేశారు అంటున్నారు. మరి ఇదే నిజమైతే ఒరిజినల్ లో ఉన్న ఫీల్ ను మిస్ కాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. లేదంటే రిజల్ట్ తేడా కొడుతుంది.
ఇక వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మించిన వకీల్ సాబ్ ను మే నె రెండో వారంలో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇంకా చేయాల్సిన షూటింగ్ మిగిలే ఉండటంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ లో ఉన్న కారణంగా చిత్రాన్ని ఏకంగా రెండు నెలలకు పైగా పోస్ట్ పోన్ చేశారు. లేటెస్ట్ గా వినిపిస్తోన్నదాన్ని బట్టి ‘వకీల్ సాబ్ ఆగస్ట్ 9’న విడుదల కాబోతోంది. యస్.. ముందుగా ఈ డేట్ లో మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబోలో రూపొందుతోన్న ఆచార్యను విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా కంటే ముందే ఈ ప్రాజెక్ట్ పోస్ట్ పోన్ అయింది. అయితేనేం.. అన్నయ్య డేట్ లో తమ్ముడు వస్తున్నాడు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article