వాలంటైన్స్ డే వెనుక కథేంటంటే…

VALENTINES DAY HISTORY

ఫిబ్రవరి 14.. ప్రేమికుల రోజు. మనసైనవారికి తమ మనసులో మాట చెప్పేందుకు ఎంచుకునే రోజు. అసలు వాలంటైన్ రోజు ఎందుకు వచ్చింది? వాలంటైన్ ఏమైనా ప్రేమికుడా? ఫిబ్రవరి 14నే ఎందుకు వాలైంటైన్స్ డే జరుపుకుంటున్నారు? ఇవి తెలియాలంటే మనం చాలా వెనక్కి వెళ్లాలి.

అది క్రీ.శ.3వ శతాబ్దం. రోమన్‌ సామ్రాజ్యాన్ని రెండో క్లాడియస్‌ చక్రవర్తి పరిపాలిస్తున్న రోజులు. తన రాజ్యాన్ని రక్షించుకోవడానికి బలమైన సైనికులు అవసరమని భావించిన క్లాడియన్.. అందుకు తగిన యువకులను సైన్యంలో చేర్చుకోవాలని నిర్ణయించాడు. అయితే, యువకులు పెళ్లి చేసుకుంటే సైన్యంలో సరిగా పనిచేయరని భావించి.. దేశంలో యువకులెవరూ పెళ్లిళ్లు చేసుకోవటానికి వీలు లేదంటూ నిషేదం విధించాడు, అంతా సైన్యంలో సేవలందించాలని హుకూం జారీచేశాడు. దీంతో దేశంలోని యువతీయువకులంతా తీవ్రంగా ఆందోళన చెందారు. వాళ్ల బాధ చూసిన స్థానిక బిషప్‌ వాలంటైన్‌ చలించిపోయాడు. ప్రేమలు పంచుకునే వయసులో పెళ్లిళ్లలను నిషేధించటం అర్థరహితమని గ్రహించిన ఆయన తన దగ్గరకు వచ్చిన యువతీయువకులకు రహస్యంగా పెళ్లిళ్లు చేయటం ఆరంభించాడు. ఈ విషయం క్లాడియస్ కు తెలియడంతో ఆయన ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే వాలంటైన్‌కు శిరచ్ఛేదన విధించాడు. అలా ఫిబ్రవరి 14న వాలంటైన్ అమరుడు కావడంతో ఆ రోజునే ప్రేమికుల దినోత్సవంగా జరుపుకోవడం మొదలైంది. దీంతోపాటు వాలంటైన్‌కు సంబంధించిన కథలు చాలానే ప్రచారంలో ఉన్నాయి. మొత్తానికి ప్రేమ పట్ల ఎంతో అభిమానం చూపిన వాలంటైన్‌ను సెయింట్‌గా గుర్తిస్తూ, ఆయన గౌరవార్థం 5వ శతాబ్దం చివర్లో పోప్‌ జలేసియస్‌ ఫిబ్రవరి 14ను ‘సెయింట్‌ వాలంటైన్స్‌ డే’గా ప్రకటించారు.

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article