Vamshi Hot Comments On chandrabaabu and lokesh
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ ని నోటికొచ్చినట్టు తిట్టిపోశారు. లోకేష్ పప్పు గాడు అని, చంద్రబాబు పెద్ద వెధవ అని, సన్నాసి అని పరుష పదజాలంతో దూషించాడు. అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పటికీ ఆపుకోలేని వల్లభనేని వంశీ చంద్రబాబును, లోకేష్ ను ఉతికి ఆరేసాడు. బండ బూతులు తిట్టాడు.
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. ఇటీవలే టీడీపీ నుంచి బయట కు వచ్చిన ఆయన అదే టీడీపీ అధినేత ఆయన పుత్రరత్నం పై ఇంత దారుణం గా తిట్టడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. తన గురించి టీడీపీ సోషల్ మీడియా లో ఇష్టా రాజ్యంగా ప్రచారం చేస్తున్నారని.. ఈ విషయాన్ని గతంలో చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకో లేదని వంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే తాను ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చిందన్నారు. నేను తప్పు చేస్తే సన్నాసినేనని.. కానీ చంద్రబాబు మాత్రం డబుల్ సన్నాసి నేను వెధవ అయితే బాబు డబుల్ వెధవ అంటూ చంద్రబాబుపై తిట్ల వర్షం కురిపించారు. గన్నవరానికి పప్పు వస్తాడో.. ఆయన బాబు చంద్రబాబు వస్తాడో తేల్చుకోవాలన్నారు. చంద్రబాబు చేస్తే సంసారం మేము చేస్తే వ్యభిచారమా అని ప్రశ్నించాడు. తాను చేస్తున్నది పార్టీకి ద్రోహం అయితే నాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న చంద్రబాబు టీడీపీలో చేరి కాంగ్రెస్ కు చేసింది ద్రోహం కాదా అని ప్రశ్నించారు. కేసులకు భయపడి వైసీపీ లో చేరుతున్నానని విమర్శలు చేస్తున్నారని తన పై ఓటుకు నోటు కేసు లేదన్నారు. చంద్రబాబు చరిత్ర ఒక పెద్ద సినిమా గానే తీయవచ్చు అని హెచ్చరించారు వంశీ. చంద్రబాబు తండ్రి ఖర్జూర నాయుడు మైసూర్ మహారాజు కాదని, అలాంటప్పుడు చంద్రబాబు నాయుడుకి నాడు ఇందిరాగాంధీ టికెట్ ఎలా ఇచ్చిందని ప్రశ్నించాడు వల్లభనేని వంశీ. తనకు పప్పుగాడి లా గాడిద పదవుల మీద వ్యామోహం లేదని చెప్పారు. వాళ్లేంటి నాకు షోకాజ్ నోటీసులు ఇచ్చేదని ధ్వజమెత్తారు.తనలా టిడిపి నుండి బయటకు వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారని బాంబు పేల్చారు. ఏదేమైనప్పటికీ చంద్రబాబును వంశీ తిడుతున్న బండబూతులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కాగా, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
tags : Vallabhaneni Vamshi, MLA, Gannavaram,TDP chief, chandrababu, nara lokesh, abuses