ఘనంగా రంగా జయంతి వేడుకలు

విజయవాడ:బెజవాడలో స్వర్గీయ వంగవీటి మోహనరంగా 75వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వంగవీటి రంగా విగ్రహానికి రంగా తనయుడు వంగవీటి రాధా పూలమాల వేసి నివాళులు అర్పించారు. వంగవీటి రాధా మాట్లాడుతూ పేదల పెన్నిది వంగవీటి రంగా. రంగా ఒక విజయవాడకు మాత్రమే చెందిన వ్యక్తి కాదు. రంగా అభిమానులు అన్నిపార్టీల్లో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రంగా అభిమానులు జయంతి వేడుకలు జరుపుకుంటున్నారు. నా తండ్రి రంగా ఆశయాలను కొనసాగిస్తానని అన్నారు.
రంగా కొడుకుగా పుట్టడం నా అదృష్టం. రంగా ఒక వ్యక్తి కాదు…ఒక శక్తి. నా తండ్రి రంగా ఒక సామిజిక వర్గానికి మాత్రమే చెందిన వ్యక్తి కాదు. బడుగు,బలహీన వర్గాలకు వెన్నంటు ఉండి, బడుగుల సమస్యలపై పోరాడిన వ్యక్తి రంగా అని అన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article