వర్మకు ఫైన్ తో పాటు పంచ్ వేసిన పోలీసులు .

VARMA REVERSE PUNCH TO POLICE

ఇస్మార్ట్ శంకర్ సినిమా చూసిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నానా హంగామా సృష్టించారు . బీర్ బాటిళ్లు ఓపెన్ చేసి హంగామా చేయడం, రోడ్డుపై హెల్మెట్ లేకుండా ట్రిపుల్ రైడ్ చేయడం లాంటి పనులు చేసిన వర్మ.. వాటిని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసి మరింత రచ్చ చేశాడు. అయితే వర్మ చేసిన ట్రిపుల్ రైడ్ పై హైదరాబాద్ పోలీసులు ఆయనకు దిమ్మతిరిగే పంచ్ విసరడం, ఆ వెంటనే దీనిపై వర్మ డిఫెరెంట్ గా స్పందించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పోలీసులు, వర్మ మధ్య అసలేం జరిగింది? వివరాల్లోకి పోతే..

ఇస్మార్ట్ శంకర్ సినిమా చూసేందుకు హెల్మెట్ లేకుండానే దర్శకులు అజయ్ భూపతి, అగస్త్యతో కలిసి మోటార్ బైక్‌పై ట్రిపుల్ రైడ్‌తో శ్రీరాములు థియేటర్‌కు వెళ్లారు వర్మ. ఆ తర్వాత వరుస ట్వీట్లతో అలజడి సృష్టించాడు. సిటీ మొత్తంలో పోలీసులు ఎక్కడా కనిపించలేదు? బాహుశా ఇస్మార్ట్ శంకర్ సినిమా చూస్తూ ఉండి ఉంటారు.. అంటూ పోలీసుల మీద తనదైన శైలిలో సెటైర్ వేస్తూ ట్రిపుల్ రైడ్ పిక్ షేర్ చేశాడు వర్మ.రామ్ గోపాల్ వర్మ ట్రిపుల్ రైడ్ ట్వీట్ చూసిన హైదరాబాద్ పోలీసులు వెంటనే రియాక్ట్ అయ్యారు. ఆ వాహనానికి రూ.1300 జరిమానా విధించారు. అంతేకాదు రామ్ గోపాల్ వర్మకు దిమ్మతిరిగేలా ఆయనను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు.

”ట్రాఫిక్ ఉల్లంఘనలను మా దృష్టికి తీసుకొచ్చినందుకు రామ్ గోపాల్ వర్మకు థాంక్స్. మీరు వ్యక్తిగతంగా కూడా అంతే బాధ్యతతో ఉండాలని కోరుకుంటున్నాం. అన్నట్టు మరో విషయం.. థియేటర్లలో ఎందుకు? బయట రోడ్లపై ఇలాంటి డ్రామాలు (వర్మ ట్రిపుల్ రైడింగ్) సర్కర్ లు నిమిషానికొకటి చూస్తుంటాం” అని పంచ్ వేశారు.వర్మ అంటేనే ఓ సంచలనం. అలాంటిది తనపైనే పంచ్ వేస్తే వర్మ మాత్రం ఊరుకుంటాడా..? వెంటనే రిటర్న్ పంచ్ విసిరాడు. ”హైదరాబాద్ పోలీస్.. ఐ లవ్ యూ.. మీరు చేస్తున్న పనికి మీకు 39 రోజుల పాటు నాన్‌స్టాప్ గా ముద్దులు పెట్టాలని అనిపిస్తోంది. నాకే గనక ఇంకో కూతురు ఉంటే కచ్చితంగా నీకే ఇచ్చి.. అల్లుడిని చేసుకునేవాన్ని” అని డిఫెరెంట్ స్టైల్ లో వర్మ రివర్స్ పంచ్ వేశారు .

POLITICAL  NEWS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article