వ‌రుణ్ అక్క‌డికి ఎందుకో!

Varun Going to US For BOXING
వ‌రుణ్‌తేజ్ ఇప్పుడు రెండు సినిమాల‌ను క‌మిట్ అయ్యాడు. ఒక‌టి హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌బోయే `వాల్మీకి`. కాగా… కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఈ రెండు చిత్రాల్లో ముందుగా ఏప్రిల్‌లో `వాల్మీకి` సినిమా మొద‌లు కానుంది. అయితే ఈ గ్యాప్‌లో కిర‌ణ్ కొర్ర‌పాటి సినిమా కోసం వ‌రుణ్ తేజ్ ఫిజిక‌ల్ సిద్ధ‌మ‌వుతున్నాడ‌ట‌. అందులో భాగంగా యు.ఎస్‌కు బాక్సింగ్ నేర్చుకోవ‌డానికి వెళుతున్నాడ‌ని స‌మాచారం. దాదాపు రెండు నెల‌లు పాటు అక్క‌డ శిక్ష‌ణ తీసుకోబోతున్నాడు వ‌రుణ్ తేజ్‌. ఈ ఏడాది `ఎఫ్2`తో స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న వ‌రుణ్‌తేజ్ త‌దుప‌రి సినిమాల‌కు సన్న‌ద్ధ‌మ‌వుతున్నాడు
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article