వాసవిపై రూ.20 లక్షల జరిమానా

ఒక వెంచర్ విషయంలో మంత్రి మల్లారెడ్డి ఫోనులో బెదిరించిన సంఘటన ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆతర్వాత మంత్రి అది తన గొంతు కాదని స్పష్టం చేశారు. మరి, సోమవారం నాడు అటవీ శాఖ అధికారులు విధించిన రూ.20 లక్షల జరిమానా ఇదే కేసుకు సంబంధించిందా? లేక మరే ఇతర వెంచర్ కు సంబంధించిందా అనే విషయంపై కొంత స్పష్టత రావాల్సిన అవసరముంది.

Vasavi Group Fined by Rs.20 Lakhs

Vasavi Group Fined by Rs.20 Lakhs

నుమతి లేకుండా చెట్లను కొట్టినందుకు ఓ బడా నిర్మాణ సంస్థపై తెలంగాణకు చెందిన అటవీ శాఖ అధికారులు భారీ జరిమానా విధించారు. రూ. 20 లక్షలు జరిమానాను విధించి వసూలు చేశారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ కు చెందిన వాసవి గ్రూపు సంస్థకు మంచి పేరు ఉంది. నాణ్యమైన నిర్మాణాల్ని చేపడుతుందని కొనుగోలుదారులు ఈ సంస్థ వద్ద ఫ్లాట్లను కొనుగోలు చేస్తారు. అయితే, కీసర అటవీ ప్రాంతం పరిధిలో ఈ సంస్థ గ్రీన్ లీఫ్ అనే వెంచర్ ను డెవలప్ చేస్తోంది. ఈ క్రమంలో భాగంగా పది రోజుల క్రితం భారీగా చెట్లను నరికి వేశారు. దీంతో, స్థానిక ప్రజాప్రతినిధులు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును అందుకున్నకీసర ఫారెస్ట్ రేంజ్ అధికారిణి అఫ్రోజ్, మేడ్చల్ అటవీ శాఖ అధికారి వెంకటేశ్వర్లు విచారణ జరిపించారు. ఆ సంస్థకు రూ.20 లక్షల జరిమానా విధించారు. ఆ సంస్థతో అంతే మొత్తంలో మొక్కల్ని నాటిస్తామని అటవీ అధికారులు తెలిపారు. మరి, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ బిల్డర్ కొత్తగా లేఅవుటు వేసినా ఇదే రీతిలో చెట్లను నరకాల్సి ఉంటుంది. మరి, అలాంటప్పుడు ప్రతిఒక్కరి మీద ఇలాగే జరిమానా విధిస్తారా? అని కొందరు డెవలపర్లు ప్రశ్నిస్తున్నారు. లేకపోతే, ఎవరో ఒకరు కావాలని పని గట్టుకుని ఒత్తిడి తెస్తే ఇలా కేసులు పెట్టి జరిమానా విధిస్తారా? అని అడుగుతున్నారు. ఇలా, గత నాలుగైదేళ్ల నుంచి ఎన్ని సంస్థల నుంచి అటవీ శాఖ అధికారులు ఇలా జరిమానాను వసూలు చేశారో పత్రికాముఖంగా వివరాల్ని వెల్లడించాలని మరికొందరు రియల్టర్లు కోరుతున్నారు.

SourceTSNEWS
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article