వారెవ్వా.. వాస‌వీ..

vasavi group three new projects

# ముచ్చ‌ట‌గా మూడు ప్రాజెక్టులు ప్రారంభం
# బాచుప‌ల్లిలో 975 చ‌.అ. ఫ్లాట్ ధ‌ర‌.. రూ.42 ల‌క్ష‌లే
# ఇప్ప‌టికే వెయ్యి ఫ్లాట్లు బుకింగ్ పూర్తి

క‌రోనా క‌ష్ట‌కాలాన్ని స‌మ‌ర్థంగా అధిగమించి.. హైద‌రాబాద్‌లో ఏకంగా మూడు ముచ్చ‌టైన ప్రాజెక్టుల్ని ప్రారంభించ‌డ‌మంటే మాట‌లు కాదు. న‌గ‌ర నిర్మాణ రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభ‌వం గ‌ల వాస‌వి గ్రూప్ ఇటీవ‌ల ఏకంగా మూడు ప్రాజెక్టుల్ని ప్ర‌క‌టించింది. మాదాపూర్‌లోని వెస్టిన్ హోట‌ల్‌లో జ‌రిగిన విలేక‌రుల స‌మావేశంలో సంస్థ ఎండీ ఎర్రం విజ‌య్ కుమార్ మూడు ప్రాజెక్టుల్ని ఆరంభించారు. మియాపూర్ మెట్రో స్టేష‌న్ నుంచి దాదాపు ఏడు కిలోమీట‌ర్ల దూరంలో గ‌ల బాచుప‌ల్లిలో వాస‌వి అర్బ‌న్ అనే బ‌డా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. సుమారు 17 ఎక‌రాల్లో మొత్తం 3,714 ఫ్లాట్ల‌ను ఇందులో నిర్మిస్తారు. ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఇందులో మొత్తం రెండు ప‌డ‌క గ‌దుల‌కే ప్రాధాన్య‌త‌నిచ్చారు. పైగా, మూడు క్ల‌బ్ హౌజుల్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో నిర్మాణం వ‌చ్చేది 30 శాతం స్థ‌లంలోనే. మిగ‌తా స్థ‌లాన్ని ప‌చ్చ‌ద‌నం, ఇత‌ర‌త్రా స‌దుపాయాలు, సౌక‌ర్యాల కోసం కేటాయించారు.

ఉప్ప‌ల్, శామీర్ పేట్‌ల‌లో..
ఉప్ప‌ల్‌లో 2.74 ఎక‌రాల్లో వాస‌వి మెట్రోపాలిస్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఇందులో మొత్తం వ‌చ్చే ఫ్లాట్ల సంఖ్య‌.. దాదాపు 270. రెండు, మూడు ప‌డ‌క గ‌దుల ఫ్లాట్ల‌కు పెద్ద‌పీట వేశారు. లియోనియా రిసార్ట్స్ చేరువ‌లో సుమారు 64 ఎక‌రాల్లో వాస‌వీ గ్రీన్ లీఫ్ అనే అత్యుత్త‌మ గేటెడ్ క‌మ్యూనిటీని ఆరంభించారు. ఒక్కో ప్లాటు విస్తీర్ణం.. 250 గ‌జాలు. ఈ మూడు ప్రాజెక్టుల్ని ప్రారంభించినందుకు సంతోషిస్తున్నామ‌ని.. కొనుగోలుదారుల‌కు ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకునేందుకు వీలైనంత త్వ‌రలో ఫ్లాట్ల‌ను విక్ర‌యిస్తామ‌ని సంస్థ ఎండీ ఎర్రం విజ‌య్ కుమార్ తెలిపారు. ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ఉప‌యోగించుకుని, సుస్థిర‌మైన విధానాల్ని అవ‌లంభిస్తూ.. నాణ్య‌తా ప్ర‌మాణాల్ని పాటిస్తూ .. కొనుగోలుదారుల‌కు స‌కాలంలో ఫ్లాట్ల‌ను అంద‌జేస్తున్నామ‌ని వివ‌రించారు. కార్య‌క్ర‌మంలో సంస్థ డైరెక్ట‌ర్ చందా సౌమ్య మాట్లాడుతూ.. ఒకేసారి మూడు ప్రాజెక్ట‌ల‌ను ప్రారంభించినందుకు ఆనందంగా ఉంద‌న్నారు.

మీడియాకు స్పెష‌ల్ డిస్కౌంట్‌
మీడియాలో ప‌ని చేసేవారికి వాస‌వి గ్రూప్ ప్ర‌త్యేక డిస్కౌంటును ప్ర‌క‌టించింది. త‌మ అన్ని ప్రాజెక్టుల్లో ఫ్లాట్ల‌ను కొనుగోలు చేయాల‌నుకునేవారికి చ‌ద‌ర‌పు అడుక్కీ రూ.50 రాయితీని అంద‌జేస్తున్నామ‌ని సంస్థ ప్ర‌తినిధులు తెలియ‌జేశారు. ఈ స‌దావ‌కాశాన్ని వినియోగించుకోవాల‌ని కోరారు. ప్ర‌స్తుతం కొంత కాలానికి గాను.. వాస‌వి అర్బ‌న్లో 975 చ‌ద‌ర‌పు అడుగుల ఫ్లాట్ ను రూ. 42 ల‌క్ష‌ల‌కు అంద‌జేస్తున్నామ‌న్నారు. దీనిపై ఒక శాతం జీఎస్టీ క‌డితే స‌రిపోతుంద‌న్నారు. ఇందులో కొంటే గోల్డ్ కాయిన్ అంద‌జేస్తామ‌ని తెలిపారు. వాస‌వి అర్బ‌న్‌లో నివ‌సించేవారికి ప్ర‌తిఒక్క స‌దుపాయం అందుబాటులో ఉంటుంద‌న్నారు. ఇప్ప‌టికే వెయ్యి మంది ఇందులో ఫ్లాట్ల‌ను బుక్ చేశార‌ని వివ‌రించారు. కొవిడ్ ప్ర‌భావం హైద‌రాబాద్ రియ‌ల్ రంగంపై కొంత కాలం ఏర్ప‌డిందన్నారు. కార్మికుల ల‌భ్య‌త క‌ష్టంగా మారింద‌న్నారు. కాక‌పోతే, ప్ర‌భుత్వ ప్రోత్సాహం వ‌ల్ల నిర్మాణ రంగం త్వ‌రగా కోలుకుంద‌న్నారు. ఆత‌ర్వాత మార్కెట్ గణ‌నీంగా పుంజుకుంద‌ని వివ‌రించారు. వాస‌వి అర్బ‌న్ ప్రాజెక్టును సుమారు 40 నెల‌ల్లో పూర్తి చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నామ‌ని తెలిపారు.

* వాస‌వి సంస్థకు కొనుగోలుదారుల అండే కొండంత బ‌ల‌మ‌ని డైరెక్ట‌ర్ శ్రీనివాస్ అన్నారు. ఒక వ్య‌క్తి ఫ్లాటును కొన‌డానికి వ‌స్తే.. నాలుగు ఫ్లాట్లు కొంటార‌ని తెలిపారు. ప్రాజెక్టు ఆల‌స్య‌మ‌వ్వ‌డానికి కొవిడ్ కూడా కార‌ణ‌మ‌ని తెలిపారు. గ‌చ్చిబౌలి చౌర‌స్తాలో 10 అంత‌స్తుల ఎత్తులో నిర్మిస్తున్న వాస‌వి స్కై సిటీ ప్రాజెక్టు 2022 చివ‌రిక‌ల్లా పూర్త‌వుతంద‌న్నారు. ఇది ప్రీమియం క‌మ‌ర్షియ‌ల్ ప్రాజెక్టు అని వివ‌రించారు.

 

Hyderabad New Projects

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article