ఎన్ కౌంటర్ గురించి సీపీ సజ్జనార్ ఏం చెప్పారంటే

Spread the love

VC Sajjanar Clarify Encounter

దిశ హత్య కేసు నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. దిశను హతమార్చిన చోటే ఈ దుర్మార్గులను అంతమొందించారు. ఈ ఎన్ కౌంటర్ కు సంబంధించిన వివరాలను పోలీస్ కమిషనర్ సజ్జనార్ వెల్లడించారు.

దిశ అత్యాచారం, హత్య కేసు నిందితులను వారం రోజుల పోలీస్ కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. ఈ క్రమంలో ఈనెల నాలుగో తేదీన చర్లపల్లి జైలు నుండి నిందితులను తీసుకొచ్చామని, 4 5 తేదీల్లో విచారించాలని అయితే క్రైమ్ సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం వారిని సంఘటన స్థలానికి తీసుకువచ్చామని పేర్కొన్నారు. పోలీసుల నుంచి ఆరిఫ్, చెన్నకేశవులు వెపన్ లాక్కున్నాడని, మిగిలిన ఇద్దరూ నిందితులు పోలీసులపై రాళ్లు రువ్వారని చెప్పారు. పోలీసులు హెచ్చరించినా వారు వినలేదని అన్నారు. ఆ తర్వాత పోలీసులు కాల్పులు జరిపారని… ఆ తర్వాత కాల్పులు ఆగిపోయాయని… అనంతరం చూస్తే నలుగురూ చనిపోయి కనిపించారని చెప్పారు. . ఈ ఎన్ కౌంటర్ లో 15 మంది పోలీసులు పాల్గొన్నారని ఆయన తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయని తెలిపారు. ఉదయం 5.30 గంటల నుంచి 6.15 ఈ ఎన్ కౌంటర్ జరిగిందని చెప్పారు. ఈ నలుగురు కరుడుగట్టిన నేరస్తులని తెలిపారు. వీరి నేర చరిత్రపై దర్యాప్తు చేస్తున్నామని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.

VC Sajjanar Clarify Encounter,disha  muder, encounter, shad nagar , chatan palli bridge , police , cp sajjanar,Commissioner Vishwanath Sajjanar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *