VEERA REDDY FIRST LOOK
- జగపతిబాబు ఫస్ట్ లుక్ విడుదల చేసిన చిత్ర యూనిట్
మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి. స్వాతంత్ర్య సంగ్రామం కాలం నాటి కథతో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా.. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్ర ప్రచారం కూడా భిన్నంగా నిర్వహిస్తున్నారు. బాహుబలి తరహాలో సినిమాలో నటించిన నటీనటులు పుట్టిన రోజు సందర్భంగా మోషన్ పోస్టర్లు రిలీజ్ చేస్తూ సినిమా మీద హైప్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా జగపతిబాబు పుట్టినరోజు సందర్భంగా మంగళవారం ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. సైరా నరసింహారెడ్డిలో జగపతిబాబు వీరారెడ్డి పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పుట్టినరోజున వీరారెడ్డి లుక్ ఎలా ఉంటుందో చూపించే మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అతిథి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి, సుధీప్ లాంటి విలక్షణ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా తమన్నా కీ రోల్‌లో అలరించనుంది.