ప్రజల వద్దకే కూరగాయలు

56
Vegetables @ Door Delivery In TS
Vegetables @ Door Delivery In TS

Vegetables @ Door Delivery In TS

భారీ వర్షాలతో కూరగాయలకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మార్కెటింగ్ శాఖ రంగంలోకి దిగింది. జంటనగరాలలో మొబైల్ రైతుబజార్లను ఏర్పాటు చేసింది. ఇవి బుధవారం 56 వాహనాలతో 102 ప్రాంతాలలో ప్రజలకు కూరగాయలు సరఫరా చేశాయి. కరోనా సమయం నుండి పెద్ద ఎత్తున మొబైల్ రైతుబజార్లతో ప్రజలకు చేరువైన విషయం తెలిసిందే. తాజాగా భారీ వర్షాలతో నిత్యావసరాలకు నగర వాసుల ఇబ్బందులు పడుతున్నారని వెంటనే స్పందించి వీలైన ప్రాంతాలలో మొబైల్ రైతుబజార్ల ఏర్పాటు చేస్తున్నది. విపత్కర పరిస్థితులు, ప్రజలు ఇబ్బందులలో ఉన్న నేపథ్యంలో వీలైన ప్రతి చోటా మొబైల్ రైతుబజార్లు అందుబాటులో ఉంచాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

Telangana Marketing Updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here