కేటీఆర్ బాటలో వేముల

vemula follows ktr instructions

మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు కార్యక్రమంపై  మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పందించారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలోని తన ఇంటి ఆవరణలో పరిసరాలు పరిశుభ్రం చేసి, మొక్కలకు నీటిని పట్టారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ సూచించినట్లు.. వర్షాకాలం దగ్గర్లోనే ఉంది కాబట్టి, దోమలు వ్యాప్తి చెందకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి ఒక్కరు విధిగా, సామాజిక బాధ్యతగా భావించి తమ ఇంటి ఆవరణలో పేరుకు పోయిన చెత్తను, నిల్వ ఉన్న నీటిని తొలగించాలి. తద్వారా దోమలను నిలువరించగలుగుతాం. సీజనల్ వ్యాధుల నుంచి మనల్ని మనం రక్షించుకోగలుగుతాం. కరోనా వైరస్ లాంటివి వచ్చిన ఈ పరిస్థితుల్లో దోమల ద్వారా వ్యాపించే సీజనల్ వ్యాధులు డెంగ్యూ, మలేరియా లాంటివి వస్తే.. కరోనా భయం ఒకటి వెంటాడుతుంది. జలుబు, జ్వరం లాంటి జబ్బులు తో కరోనా నే కావొచ్చు అనే భయం నెలకొంటుంది. అందుకోసం ఇంటి ఆవరణలోని పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకుందాం. దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను దరి చేరకుండా చేసుకుందాం” అని మంత్రి కోరారు.

Telangana Dry Day Updates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *