రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా అభివృద్ది ఫలాలు అందుతున్నాయి

రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా అభివృద్ది ఫలాలు అందుతున్నాయి దేశం అంతటా కరెంట్ కట కట ఉన్నది.మోడీ సొంత రాష్ట్రంలోనే కరెంట్ లేదు తెలంగాణలో మాత్రం 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నాం ఇది కేవలం కేసిఆర్ ముందు చూపు వల్లే సాధ్యమయ్యింది దేశాన్ని అధాని,అంబానీకి అమ్ముతున్నరు తెలంగాణ మీద కేంద్రం అన్నిట్లో వివక్ష చూపుతోంది పాలమూరు కు నీళ్లు రాకుండా కృష్ణ జలాల్లో అన్యాయం చేస్తున్నారు బండి సంజయ్ ఇవాళ ఏం వారం,రేపు ఏం వారం అన్న అని తిరుగుతున్నడు.. అభివృద్ధి మాత్రం అక్కర్లేదు ఎంపి అరవింద్ జై శ్రీరామ్ మాటలు తప్పా..ఒక్క గుడి కట్టించింది లేదు గుజరాత్,ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల గ్రూప్ వన్ ఉద్యోగాల్లో కూడా ఉర్దూ ఉంటుంది యుపిఎస్సి లో కూడా ఉర్దూ ఉంటుంది అరవింద్,బండి సంజయ్ వి అవగాహన రహిత,రెచ్చగొట్టే మాటలు ఏపి లో వ్యవసాయ కరెంట్ మోటార్లకు మీటర్లు పెడుతున్నారు తెలంగాణలో కేసిఆర్ ఒప్పుకోలేదు 5వేల కోట్లు ఇస్తానన్నారు…ఇవ్వకున్న పర్వాలేదు నాకు రైతులే ముఖ్యమన్నారు కేసిఆర్ బక్క పలుచని కేసిఆర్ మీదకి తెలంగాణ వ్యతిరేక శక్తులన్ని ఏకమై వస్తున్నాయి కేసిఆర్ కంటే ముందు కేసిఆర్ వచ్చిన తర్వాత అభివృద్ది ప్రజలు గమనించాలి గ్రామాల్లో దీనిపై విస్తృతంగా చర్చ జరగాలి- మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్:దేశమంతటా నేడు కరెంట్ కట కట ఉంటే కేసిఆర్ ముందు చూపు వల్ల తెలంగాణలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామని, ప్రధాని మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో కూడా కరెంట్ లేదని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.

గురువారం బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్, వేల్పూర్, ఏర్గట్ల మండలాల నుంచి బీజేపీ,కాంగ్రెస్,బీఎస్పీ కి చెందిన 300 మంది నాయకులు,కార్యకర్తలు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు.మంత్రి వారికి గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ:కేసిఆర్ జనరంజక పాలన, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన వారికి స్వాగతం చెప్పారు.ఇక నుండి మీరు టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులని మీకు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు.బాల్కొండ నియోజకవర్గం అభివృద్ది మీకు కళ్ళ ముందే కనిపిస్తుందని అన్నారు. కేసిఆర్ దయవల్ల 100 కోట్లతో చెక్ డ్యాములు నిర్మించానని చెప్పారు. కేసిఆర్ వచ్చిన తర్వాత,ఎస్సారెస్పీ పునర్జీవ పథకం ద్వారా సాగునీటికి గోస లేకుండా చేశాడని అన్నారు.నేడు బాల్కొండ లో ఏ మూలకు చూసుకున్న 30 లక్షలకు ఎకరం తుక్కువ లేదన్నారు.వందల కోట్లతో సి.సి రోడ్లు, డ్రైన్లు,సెంట్రల్ లైటింగ్, వైకుంఠదామాలు,పల్లె ప్రకృతి వనాలు,రైతు వేదికలు నిర్మించు కున్నమని తెలిపారు.పార్టీలకు అతీతంగా అభివృధి, సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యమంత్రి కేసిఆర్ అందిస్తున్నారన్నారు. ప్రధాని మోడీ దేశాన్ని అధాని,అంబానీకి అమ్ముతున్నరని దుయ్యబట్టారు.తెలంగాణ సాగు నీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వడం లేదన్నారు.పక్కనున్న ఆంధ్రప్రదేశ్,కర్ణాటక రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చిందని,బాగా మాట్లాడుతున్న బండి సంజయ్,అరవింద్ దమ్ముంటే జాతీయ హోదా తెప్పించి రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలని డిమాండ్ చేశారు.తెలంగాణ కు వచ్చే పరిశ్రమలు గుజరాత్ కు తరలించుకు పోతుంటే నలుగురు బీజేపీ ఎంపీలు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు.పాలమూరు కు నీళ్లు రాకుండా కృష్ణ జలాల్లో అన్యాయం చేస్తున్నారన్నారు.ఇలా అన్నిట్లో
తెలంగాణ మీద కేంద్రం అన్నిట్లో వివక్ష చూపుతోందిని విమర్శించారు.బండి సంజయ్ ఇవాళ ఏం వారం,రేపు ఏం వారం అన్న అని తిరుగుతున్నడు కానీ ఆయనకు అభివృద్ధి గురించి ఏమాత్రం అక్కర్లేదన్నారు.తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే తెలంగాణ ఎంపీగా ఎట్లా ఉండగలుగుతున్నారనిమండిపడ్డారు.ఎంపి అరవింద్ ఏమన్నా అంటే జై శ్రీరామ్ మాటలు చెప్తాడు తప్పా..ఒక్క గుడి కట్టించింది లేదన్నారు. తాను కేసిఆర్ ను ఒప్పించి ఒక్క బాల్కొండ లోనే 50 గుడులు కట్టించానని చెప్పారు.ఇటీవల గ్రూపు వన్ ఉద్యోగాలపై అనవసర విద్వేషాలు రెచ్చగొట్టేవ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.గుజరాత్,ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల గ్రూప్ వన్ ఉద్యోగాల్లో కూడా ఉర్దూ ఉంటుందని,యుపిఎస్సి లో కూడా ఉర్దూ ఉంటుందన్నారు.అంత మాత్రాన దేశం అంతా ముస్లిం కలెక్టర్లు ఉన్నారా అని నిలదీశారు.అరవింద్,బండి సంజయ్ వి కేవలం అవగాహన రహిత,రెచ్చగొట్టే మాటలే అన్నారు.
ఏపి లో వ్యవసాయ కరెంట్ మోటార్లకు మీటర్లు పెడుతున్నారని గుర్తు చేశారు.స్వయంగా ఏపి మంత్రి 6 నెలల్లో మోటార్లు పెట్టడం పూర్తి చేస్తామని అధికారికంగా ప్రకటించారన్నారు. అందుకు కేంద్రం 5వేల కోట్ల రుణపరిమితి ఆశ చుపారన్నారు.తెలంగాణలో అందుకు కేసిఆర్ ఒప్పుకోలేదన్నారు. 5వేల కోట్లుఇవ్వకున్న పర్వాలేదు నాకు రైతులే ముఖ్యమని కేసిఆర్ తెగేసి చెప్పారని అన్నారు.
తెలంగాణ ను అన్నిట్లో అగ్రగామిగా నిలుపుతున్న బక్క పలుచని కేసిఆర్ మీదకి తెలంగాణ వ్యతిరేక శక్తులన్ని ఏకమై వస్తున్నాయన్నారు.ప్రజలే వారికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.కేసిఆర్ కంటే ముందు కేసిఆర్ వచ్చిన తర్వాత అభివృద్ది గమనించాలని,గ్రామాల్లో ప్రజలు దీనిపై విస్తృతంగా చర్చ జరపాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక టిఆర్ఎస్ మండల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

 

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article