మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ఏమైంది? హఠాత్తుగా ఆంధ్ర ప్రదేశ్ మీద పడ్డాడు. ఇది రాజకీయ కోణంలో భాగమా? లేక నిజంగానే ఆంధ్రప్రదేశ్ మీద మండి పడ్డాడా? అనే విషయం ఎవరికీ అర్థం కావడం లేదు. మహబూబ్ నగర్ పర్యటనలో భాగంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. తెలంగాణ కు అన్యాయం జరిగితే కేసీఆర్ చూస్తూ ఊరుకోడని అన్నారు. ఓకే.. ఇది ఒకరకంగా ఆయన్ని సంతృప్తి పరిచే మాట అనుకుందాం. కానీ, ఆతర్వాత లంకల పుట్టినోళ్లు అందరు రాక్షసులే.. ఆంధ్రోళ్లు ఎన్నడూ తెలంగాణ మేలు కోరుకోరు అని చెత్త కామెంట్లు చేశాడు. 2019 ఎన్నికల తర్వాత రెండు రాష్ట్రాల మధ్య వాతావరణం ప్రశాంతంగా ఉన్న సమయంలో.. ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల ఇరు రాష్ట్రాల సంబంధాలు దారుణంగా దెబ్బతింటాయి. ఏమైనా సమస్యలుంటే ఇరు ముఖ్యమంత్రులు కలిసి చర్చించుకోవాలి. అంతేతప్ప, తెలంగాణ ప్రజలు మరో యుద్ధానికి సిద్ధం కావాలని.. ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయకూడదు. ఏపీ ప్రభుత్వం కడుతున్న అక్రమ ప్రాజెక్టుల పై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడటం దాకా ఓకే.. కానీ, అక్కడి ప్రజల్ని రెచ్చగొట్టడమే కరెక్టు కాదనే విషయాన్ని మర్చిపోవద్దు.