“కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను,కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను కేసీఆర్ ఎత్తి చూపుతున్నందున కేసీఆర్ బిడ్డ కవితపై నిరాధారమైన వార్తలు సృష్టించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే చట్టం పరిధిలో ఉన్న ప్రక్రియను అనుసరించి విచారణ చేపట్టాలే కానీ …ఆలు లేదు సూలు లేదు అల్లుడి పెరు సోమలింగం అన్న చందంగా మీడియాకు లీకులు ఇచ్చి కవిత వ్యక్తిగత ప్రతిష్టను భంగం చేయడం కేంద్ర ప్రభుత్వ నీతిమాలిన చర్య అని అభిప్రాయపడ్డారు. మళ్ళీ ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడితే తెలంగాణ ప్రజలు బీజేపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఇంకో వైపు బీజేపీ పార్టీ కార్యకర్తలు హైదరాబాద్ లోని కవిత ఇంటిపై దాడి చేయడం హేయమైనది.. పిరికిపంద చర్యగా అభివర్ణించారు. టీఆర్ఎస్ పార్టీ మొత్తం కవితకు అండగా ఉండి బీజేపీ కార్యకర్తలను అడ్డుకుంటాం తరిమికొడతామన్నారు. అనవసరంగా కేసీఆర్‌ని కానీ కేసీఆర్ కుటుంబాన్ని కానీ ఇలా లీకుల పేరుతో… నిరాధారమైన కేసుల పేరుతో వేదించాలాని చుస్తే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరించారు.