VENKAIAH NAIDU COMPLETED TWO YEARS
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పార్టీ ఫిరాయింపులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఏపీలో 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న వెంకయ్య రెండేళ్ళ కాలంలో తానేమి చేశానో చెప్పారు. నా ఎదుగుదలకు బిజెపి, స్నేహితులే కారణమని చెప్పిన ఆయన ఉపరాష్ట్రపతి పదవితో ప్రజల దగ్గర కు చేరుతున్నానని చెప్పారు. ఉపరాష్ట్రపతి పదవికి సెలవు లేదు…ఎక్కడికి వెళ్ళడానికి లేదన్న వెంకయ్య తాను 5 రంగాలపై దృష్టి పెట్టి కృషి చేస్తున్నానని చెప్పారు. యువత కోసం 9 వందల యూనివర్సిటీ లు ఉన్నాయన్న ఆయన రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నానని చెప్పారు. రైతు కుటుంబం నుండి వచ్చానని గర్వంగా చెప్పుకున్నారు. ఇక 64 కళల గొప్పతనం చెప్పి వారిని కలుస్తున్నానని పేర్కొన్నారు. సమాజ సేవకులను ప్రోత్సహిస్తున్నానని పేర్కొన్నారు. డాక్టర్స్, అధ్యాపకులు, లాయర్స్, ఇతర ఉద్యోగ సంఘాల సమస్యల పరిష్కారానికి పని చేస్తున్నానని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా పర్యటించి దౌత్య సంబంధాలు బలోపేతం చేస్తున్నానన్న ఆయన 22 దేశాలు తిరిగానని పేర్కొన్నారు. గతంలో ప్రపంచం లో అందరూ అమెరికా, చైనా ల వైపు చూసేవారు ప్రస్తుతం భారత్ వైపు చూస్తున్నారని గర్వంగా చెప్పారు .దేశం ఆర్థికం గా ఎదుగుతుండటం తో గుర్తింపు వచ్చిందన్న వెంకయ్య ఉపరాష్ట్రపతి పదవి నాలుగు గోడలకు పరిమితం కాకూడదనే విజ్ఞాన యాత్ర పేరిట జనం దగ్గరకు చేరువ అవుతున్నానన్నారు. ఇక ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే విలువలుండాలన్న ఆయన ప్రవర్తన నియమావళి రాజకీయ పార్టీలు రూపొందించుకోవాలన్నారు. కులమతాలకు అతీతంగా ఓటు వెయ్యాలని చెప్పారు.
ఎపీలో 23 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపు, స్పీకర్ నిర్ణయం లేకపోవడంపై ప్రస్తావించారు వెంకయ్య నాయుడు. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి రాజ్యాంగంలో టెన్త్ షెడ్యూల్లో స్పష్టత లేదని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకోకపోతే ఏం చేయాలనే అంశంపై రాజ్యాంగంలో స్పష్టత లేదని వెంకయ్యనాయుడు అన్నారు. దీని వల్లే రాజకీయ సంక్షోభం ఏర్పడుతుంది అన్నారు. న్యాయస్థానాల్లోనూ దీనికి సంబంధించిన కేసుల విచారణ నిర్ణీత గడువులో జరగడం లేదని వెంకయ్య పేర్కొన్నారు. తమిళనాడులో కేంద్ర మాజీమంత్రి చిదంబరం 2009లో ఎన్నికవడంపై కొనసాగుతున్న కేసును వెంకయ్యనాయుడు గుర్తు చేశారు. అంతేకాదు కొద్దిరోజుల క్రితం ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం, పార్టీ మారిన టీడీపీ ఎంపీల విషయంలో రాజ్యసభ చైర్మన్గా ఉన్న వెంకయ్యనాయుడు ఇలా ఫిరాయింపుల తీరు సరికాదని వ్యాఖ్యానించారు.
VENKAYAA NAYUDU LATEST COMMENTS
tags : vice president, venkaiah naidu, party defections,