ఎన్టీఆర్ తో వెట్రిమారన్ ..

130
Vertrimaran To Direct NTR
Vertrimaran To Direct NTR

Vertrimaran To Direct NTR

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో ఆర్ఆర్ఆర్ చేస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఈ యేడాది మేకు రిలీవ్ అవుతాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో సినిమా ఉంటుందని ముందు నుంచి గట్టిగానే వినిపిస్తోంది. ఈ టైమ్ లో ఆ మూవీ పోస్ట్ పోన్ అయింది అంటే ఎవరైనా ఎలా ఫీలవుతారు.. కదా.. ఇప్పుడు అవే వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాను పక్కన బెట్టాడని.. ఓ తమిళ్ దర్శకుడితో సినిమాకు సిద్ధమవుతున్నాడు అనేదే లేటెస్ట్ రూమర్.

నిజానికి ఎన్టీఆర్.. కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ లో మరో సినిమా చేయాలనుకున్నాడు. ఇటు కళ్యాణ్ రామ్ కూడా జై లవకుశ తర్వాత తమ్ముడితో మరో మీడియం బడ్జెట్ సినిమాను రూపొందించాలనే ప్రయత్నాల్లో చాలామంది దగ్గర కథలు వింటున్నాడు. ఈ క్రమంలో వినిపిస్తోన్న ఈ వార్త టాలీవుడ్ ను వేడెక్కిస్తోంది. తమిళ్ లో అర్బన్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చేస్తూ అద్భుతమైన కంటెంట్ తో అఖండ విజయాలు సాధించే దర్శకుడు వెట్రిమారన్. రీసెంట్ గా ధనుష్ తో చేసిన అసురణ్ అక్కడ ఏకంగా వంద కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమా బడ్జెట్ ఆర్టిస్టుల రెమ్యూనరేషన్ తీసేస్తే ఐదు కోట్లు కూడా ఉండదంటే అతిశయోక్తి కాదు. అలాంటి వంద కోట్లంటే ఎంత పెద్దవిజయం. అది కూడా థియేట్రికల్ గానే. మరి నాన్ థియేట్రికల్, డబ్బింగ్ అంటూ భారీ ఫ్రాఫిట్స్ తెచ్చాయి.
అసురణ్ చూసిన తర్వాత చాలామంది అక్కడి టాప్ స్టార్స్ వెట్రీమారన్ తో సినిమా చేయాలనుకున్నారు. ఈ క్రమంలో అతను కళ్యాణ్ రామ్ కు ఓకథ వినిపించాడనీ.. దాన్ని ఎన్టీఆర్ తో చేస్తున్నారనేది లేటెస్ట్ రూమర్. మరి ఇది రూమరా లేక నిజమేనా అనేది అప్పుడే తేల్చలేం కానీ.. వెట్రిమారన్ మాత్రం కళ్యాణ్ రామ్ కు కథ వినిపించాడు అనేది నిజం అంటున్నారు. ఇటు కళ్యాణ్ రామ్ కూడా ఈ సారి కంటంట్ బేస్డ్ సినిమాతోనే మీడియం రేంజ్ లో పూర్తి చేయాలనే ప్లాన్ లో ఉన్నాడు. అందుకు ఈ కథ కరెక్ట్ గా ఉందని దర్శకుడిని లాక్ చేశాడంటున్నారు. ఏదేమైనా ఈ ఆదివారం వినిపించిన మరో పెద్ద టాలీవుడ్ రూమర్ గా ఇది హల్చల్ చేస్తోంది.

Vertrimaran To Direct NTR,Filmmaker Vetrimaran,Asuran Director Vetrimaran,#Jr NTR, #Vetrimaran,Tollywood Latest News,tsnews live updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here