అది సంస్కారమేనా?

120
VH Fires On MP Bandi Sanjay Kumar
VH Fires On MP Bandi Sanjay Kumar
VH Fires On MP Bandi Sanjay Kumar
తెలంగాణా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ హనుమంత రావు  బీజేపీ  ఎంపీ సంజయ్‌  చేసిన వ్యాఖ్యలపై, అలాగే ఆర్ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ బాంబులేస్తామనడం కత్తులు తీస్తామనడం సంస్కారమేనా? అని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ప్రశ్నించారు.  ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కేసులు పెట్టరా? అని ప్రశ్నించారు.  గతంలో అక్బరుద్దీన్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కేసులు పెట్టారు..చౌకీదార్‌ చోర్‌ అంటే రాహుల్‌పై కేసు పెట్టారు. దేశప్రజలంతా హిందువులన్న భగవత్‌పై కేసు ఎందుకు పెట్టరు? అని ఆయన ప్రశ్నించారు. కత్తులు పడతాం, లాంచర్లు పడతాం , బాంబులు పడతాం అంటూ హింస ను ప్రేరేపించేలా చేస్తున్న వ్యాఖ్యలపై ఎందుకు కేసులు పెట్టరు అంటూ మండిపడ్డారు.  మున్సిపల్‌ ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రజల్ని రెచ్చగొడుతున్నారని  వీహెచ్ ఫైర్ అయ్యారు.  హైదరాబాద్ లో ఇటీవల పర్యటించిన ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ వ్యాఖ్యలపై వీహెచ్ ఎల్బీనగర్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. దేశంలో అందరూ హిందువులేనంటూ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు ఇతర మతాల వారిని బాధపెట్టాయని వీహెచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఇక ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చెయ్యలేదని వీహెచ్ తనదిఅన స్టైల్ లో పోలీసులపై మండిపడిన విషయం తెలిసిందే . ఇక ఈ నేపధ్యంలో మరోమారు ఆయన మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు, బండి సంజయ్ చేసిన తీవ్ర వ్యాఖ్యలపై  విరుచుకుపడ్డారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here