కాకినాడలో ధర్నా చెయ్యాలని వీహెచ్ సంచలన నిర్ణయం .. ఎందుకో తెలిస్తే షాక్

VH SENSATIONAL DECISION TO DHARNA IN KAKINADA

తెలంగాణా రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వీ హెచ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా ముఖ్యపట్టణం కాకినాడలోని అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం నాడు ధర్నా చేయనున్నట్టు తెలంగాణ కాంగ్రెస్ నేత వీ హనుమంతరావు వెల్లడించారు.

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు తెలంగాణలో తీవ్ర అవమానం జరిగిందని, దాని గురించి ఏపీ ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఈ నిరసన కార్యక్రమం చేయాలని నిర్ణయించారని అన్నారు. ఇంద్రపాలెం బ్రిడ్జ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలుపుతామని అన్నారు. ఇదే సమయంలో ఈసీపైనా ఆరోపణలు చేసిన వీహెచ్, ఇష్టానుసారం అధికారులను బదిలీ చేస్తున్న ఈసీ ఓవరాక్షన్ చేస్తోందని ఆరోపించారు. బీజేపీ ఎవరిపై దాడి చేయమంటే, వారిపై ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారని అన్నారు. ఇండియాలోని స్వతంత్ర వ్యవస్థలను నరేంద్ర మోదీ భ్రష్టు పట్టించారని వీహెచ్ ఆరోపించారు.ఏపీలోని టీడీపీ అధినేత చంద్రబాబుకు తన మద్దతు ప్రకటించిన వీహెచ్ ఇప్పుడు ఏపీలో ఆందోళన చెయ్యాలనే నిర్ణయం రెండు తెలుగురాష్ట్రాల్లో చర్చకు కారణం అవుతుంది .

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article