విక్టరీ వెంకటేశ్ సినిమాలతో పాటు మణప్పురం గోల్డ్, రామరాజ్ కాటన్ పంచెలు వంటి కమర్షియల్ యాడ్స్‌లో కూడా నటించారు. ఇప్పుడు మరో టర్న్ తీసుకోబోతున్నారు. ఆయన త్వరలోనే ఓ రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఇంతకు ఆ షో ఏదో కాదు.. బిగ్‌బాస్. హిందీ నుండి తెలుగులోకి ఇంపోర్ట్ అయిన ఈ షోను స్టార్ మా వారు కండెక్ట్ చేస్తున్నారు. తొలి సీజన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్.. రెండో సీజన్‌కు నాని వ్యాఖ్యాతగా వ్యవహరించారు. రెండో సీజన్ మాత్రం పలు వివాదాలకు చోటు చేసుకుంది. అయితే మూడో సీజన్‌లో ఎలాంటి వివాదాలు చోటు చేసుకోకుండా ఉండాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. అందులో భాగంగా వెంకటేష్‌ను బోర్డ్‌లోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఫిలింనగర్ వర్గాల సమాచారం.