తెలుగు త‌ర్వాత త‌మిళంలో విద్యాబాల‌న్ ఎంట్రీ

Vidhya Balan entry to Tamil Industry
గ‌త ఏడాది నంద‌మూరి ఎన్టీఆర్ బ‌యోపిక్ `య‌న్‌.టి.ఆర్‌` లో బ‌స‌వ‌తార‌క‌మ్మ పాత్ర‌లో న‌టించిన విద్యాబాల‌న్ ఈ ఏడాది మ‌రో ద‌క్షిణాది సినిమాల్లోకి డెబ్యూ ఇవ్వ‌నున్నారు. అదేదో త‌మిళ చిత్రసీమ‌లోకి. అజిత్ ప్ర‌ధాన పాత్ర‌లో హెచ్‌.వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోయే బాలీవుడ్ చిత్రం `పింక్‌` రీమేక్‌లో అజిత్ స‌ర‌స‌న విద్యాబాల‌న్ న‌టించ‌బోతున్నార‌ని అధికారిక స‌మాచారం. ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాత బోనీ క‌పూర్ నిర్మించ‌బోతున్నాడ‌ట‌. అమితాబ్ పాత్ర‌లో అజిత్ న‌టిస్తుండగా.. తాప్సీ పాత్ర‌లో శ్ర‌ద్ధాశ్రీనాథ్ న‌టిస్తుంది. త్వ‌ర‌లోనే షూటింగ్ ప్రారంభం కానుంది.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article