VIJAY CONTRIBUTION TO ARMY
- సైనికుల కుటుంబాలకు ఆర్థికసాయం
- అందరూ అండగా నిలవాలని పిలుపు
సినీ హీరో విజయ్ దేవరకొండ తన కొండంత మనసు చాటుకున్నాడు. సరిహద్దుల్లో కాపలా కాస్తూ దేశం ప్రాణాలర్పిస్తున్న నిజమైన హీరోలకు ఈ హీరో అండగా నిలిచాడు. రెండు రోజుల క్రితం జమ్మూకాశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మందికి పైగా సైనికులు వీరమరణం పొందిన ఘటనపై విజయ్ స్పందించాడు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ట్వీట్లు, ప్రకటనలతో సానుభూతి, ఆగ్రహం వ్యక్తంచేస్తండగా.. విజయ్ మాత్రం సైనికుల కుటుంబాలను ఆదుకునే దిశగా ముందుకు కదిలాడు. ‘‘వారు మన కుటుంబాల్ని రక్షిస్తున్నారు. మనం ఆ సైనికుల కుటుంబాలకు అండగా నిలవాలి. మన సైనికుల జీవితాలను సాయంతో వెలకట్టలేం. కానీ మనం మనవంతు సహకారం అందించాలి. నావంతు సహకారం నేను అందించా. మనందరం కలిసి సాయం చేద్దాం. మనమంతా కలిసి వారికో పెద్ద సపోర్ట్‌ని క్రియేట్ చేద్దాం’’ అని ట్వీట్ చేశాడు. తాను చేసిన సాయానికి సంబంధించిన సర్టిఫికేట్ ను షేర్ చేసినప్పటికీ, ఎంత మొత్తం సాయం చేశాడనే విషయం తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. మొత్తానికి విజయ్ రీల్ పైనే కాకుండా రియల్ లైఫ్ లోనూ అందరి మన్ననలూ చూరగొన్నాడు. హ్యట్సాఫ్ విజయ్.