అభినందన్ పాత్రలో…

109
vijay devarakonda
vijay devarakonda

Vijay Devarakonda Act in Bollywood movie

గతేడాది భారత్‌, పాకిస్తాన్‌ సైనికుల మధ్య జరిగిన దాడిలో భారత వింగ్‌కమాండర్‌ అభినందన్‌.. పాక్ సైనికుల చేతికి చిక్కారు. మూడు రోజులపాటు బంధీగా ఉన్నారు. ఆ తర్వాత పాక్‌ అభినందన్‌ని భారత ప్రభుత్వానికి అప్పగించింది. ఆ కథనం ఆధారంగా అభిషేక్‌ కపూర్‌ ఓ సినిమా ప్లాన్ చేయనున్నారని బాలీవుడ్ టాక్. సంజయ్‌లీలా భన్సాలీ, భూషణ్‌కుమార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారట. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ బాలీవుడ్ చిత్రంలో నటించనున్నాడా? అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. స్క్రిప్ట్ నచ్చడంతో విజయ్ ఈ సినిమా చేయడానికి అంగీకరించినట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమా విషయమై అధికారిక అనౌన్స్ కావాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here