విజయదేవరకొండకు పొగరెక్కిందా?

Vijay Devarakonda HeadStrong
డిఫరెంట్ మూవీస్ ను  చూజ్ చేసుకుంటూ తనకంటూ ఓ క్రేజ్ ఫామ్ చేసుకున్న స్టార్ విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా అంటూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న ఈ కుర్రాడు ఆ తర్వాత అదే స్థాయిలో ఫ్లాపులు ఫేస్ చేశాడు. ఇక కెరీర్ కు కీలకం అని భావించిన టైమ్ లో ‘వరల్డ్ ఫేమస్ లవర్’అంటూ వచ్చాడు. నలుగురు హీరోయిన్లు, మూడు కథలు, అంటూ ఓ కొత్త పాయింట్ తోనే వచ్చిందీ సినిమా. కానీ ఎటొచ్చీ.. ఈ సంక్లిష్టమైన కథనానికి ప్రేక్షకులు సంకటంలో పడిపోయారు. ఈ కథను ఇంత సాదాగా ఎందుకు తీశాడా.. ఈ కథకు ఇంత బిల్డప్ అవసరమా అంటూ ఒక్కో కథను ఎనాలసిస్ చేస్తూ వెళితే.. ఖచ్చితంగా అది దర్శకుడి తప్పిదంగానే అనిపించినా.. ఆ ప్రభావం పడేది మాత్రం విజయ్ దేవరకొండపైనే. పైగా ఈ సినిమాతో విజయ్ సాయి అంటూ కొత్తగా పేరు కూడా మార్చాడు. అఫ్ కోర్స్ అతని అసలు పేరు కూడా అదే.
మొత్తంగా వరల్డ్ ఫేమస్ లవర్ కు ముందు నుంచే పెద్దగా బజ్ లేదు. ట్రైలర్ లోనే కన్ఫ్యూజ్ చేసిన దేవరకొండ.. దాన్ని వెండితెరపైనా కంటిన్యూ చేశాడు. సినిమాలో ఆకట్టుకున్నది ఏదైనా ఉంటే అది కేవలం విజయ్, ఐశ్వర్య రాజేశ్ ల లవ్ స్టోరీ సాగిన ఇల్లందు ఎపిసోడ్ మాత్రమే. ఇది మాత్రం చాలా హానెస్ట్ గా రాసుకున్నాడు దర్శకుడు. అదే టైమ్ లో ఈ ఎపిసోడ్ లో కేథరీన్ పాత్రను మరీ వ్యాంప్ లా మార్చడం కూడా బాలేదు. ప్యారిస్ ఎపిసోడ్ లో ఫీల్ రాలేదు. ఇటు రాశిఖన్నా కోసం అతను అంత తాపత్రయపడేంత బలమైన సన్నివేశాలు వారి ప్రేమకథలో కనిపించలేదు. మొత్తంగా ఇదో సాదాసీదా ప్రేమకథ(లు). సో.. ప్రమోషన్స్ లో ‘ప్రతి బాల్ సిక్స్ కొట్టాలనే అనుకుంటాను. ఇప్పుడు కూడా బంతి గాలిలో ఉంది’ అని చెప్పాడు. సినిమా రివ్యూస్ తో పాటు వచ్చిన టాక్ చూస్తోంటే ఈ బాల్ కు సింగిల్ కూడా రానట్టే కనిపిస్తోంది.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article