సింగ‌రేణిలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌

Vijay Devarakonda in Singareni
`పెళ్ళిచూపులు`తో సూప‌ర్‌హిట్ కొట్టి హీరోగా కెరీర్‌ను స్టార్ట్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. `అర్జున్‌రెడ్డి`తో యూత్‌లో తిరుగులేని క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. `గీత గోవిందం` సినిమాతో వంద‌కోట్ల క్ల‌బ్‌లో చేరాడు. టాక్సావాలాతో కూడా మ‌రో స‌క్సెస్‌ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వంలో `డియ‌ర్ కామ్రేడ్` చిత్రంలో న‌టిస్తున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. కాకినాడ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమా ఇటీవ‌ల కాకినాడ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. తాజాగా సినిమా సింగ‌రేణిలో షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు సినిమాలో రేర్‌గా క‌న‌ప‌డే సింగ‌రేణి బొగ్గు గ‌నుల్లో విజ‌య్ దేవ‌ర‌కొండ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ నిర్మిస్తుంది.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article