విజయ్ దేవరకొండది అహంకారమా లేక..?

Vijay Devarakonda Neglects WFL Producer

విజయ్ దేవరకొండ.. అనూహ్యంగా ఎదిగిన స్టార్. ఆ స్టార్డమ్ తో పాటు ఓ రేంజ్ లో క్రేజ్ కూడా వచ్చింది. ఆ క్రేజ్ తోనే హిందీలో ఒక్క సినిమా కూడా చేయకుండానే బాలీవుడ్ సర్కిల్స్ లో విపరీతమైన పరిచయాలు పెంచింది. అదే ఇప్పుడు అతనితో ఓ భారీ ప్యాన్ ఇండియన్ సినిమా చేయిస్తోంది. పూరీ జగన్నాథ్ స్వీయ డైరెక్షన్ లో కరణ్ జోహార్ నిర్మాణ భాగస్వామిగా ఫైటర్ అనే సినిమా మొదలైంది. అయితే ఈ మూవీపై చూపిన శ్రద్ధ అతను తన లేటెస్ట్ రిలీజ్ వరల్డ్ ఫేమస్ లవర్ పై చూపలేకపోతున్నాడు.
వరల్డ్ ఫేమస్ లవర్..  విజయ్ లేటెస్ట్ మూవీ.

గత శుక్రవారం విడుదలైన ఈ మూవీకి మిక్స్ డ్ టాక్ వచ్చింది. అంతే కానీ ఫ్లాప్ అనలేదు ఎవరూ. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంతో విజయ్ క్యారెక్టర్ పై ఓ మచ్చ పడింది. ఖచ్చితంగా చెబితే అతని గత సినిమాల దర్శకులను అసలు ఎలివేట్ కానివ్వలేదు. వరుసగా తనే ప్రమోషన్స్ లో హైలెట్ గా అవుతూ వచ్చాడు. ఈ సినిమాకూ అదే  చేశాడు. విడుదలకు వారం రోజుల ముందు ఒకే ఒక్క ఇంటర్వ్యూ తో సరిపెట్టాడు క్రాంతి మాధవ్. ఆ తర్వాత ఏ ఫంక్షన్ లో కూడా అతను కనిపించలేదు. ఇక సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చిన నేపథ్యంలో దాని గురించే పట్టించుకోవడం లేదు విజయ్.

నిజానికి ఇవాళా రేపూ ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాలకు కూడా సాయంత్రానికే ప్రెస్ మీట్ పెట్టి సక్సెస్ మీట్ అంటున్నారు. అలాంటిది ఇలా తన సినిమాను అర్థాంతరంగా వదిలేయడం అంటే నిర్మాతను నట్టేట ముంచినట్టే. ఇంత నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోన్న విజయ్ పై ఈ నిర్మాత మాత్రమే కాదు.. తన గత చిత్రాల నిర్మాతలు సైతం ఇంటర్నల్ గా ఎన్నో ఆరోపణలు చేశారట. కానీ అతని బుద్ధి మాత్రం మారడం లేదు.

మరి ఇది అహంకారమా లేక తను నిజంగానే పెద్ద స్టార్ ను అనే భ్రమలో ఉన్నాడా అనేది తెలియడం లేదు.
అయినా నిర్మాత గురించి ఆలోచించని ఏ నటుడూ స్టార్డమ్ పొందిన దాఖలాలు ఇండస్ట్రీలో లేవు. పరిశ్రమలో రాణించాలంటే డబ్బులు మాత్రమే కాదు.. కాస్త క్యారెక్టర్ కూడా అవసరమే. ఇబ్బందిలో ఉన్న నిర్మాత కోసం కనీసం మాట సాయం చేయలేకపోయిన ఇలాంటి హీరోలు ఎంతో కాలం రాణించరు అనేది నిజం. ఏదేమైనా విజయ్ దేవరకొండ మాత్రం వరల్డ్ ఫేమస్ లవర్ విషయంలో పూర్తిగా అహంకార ధోరణిలో కనిపిస్తున్నాడనేది ఇండస్ట్రీ టాక్ కూడా. ఒకవేళ పూరీ జగన్నాథ్ సినిమా కూడా అటూ ఇటైతే ఇక మనోడి పని అంతే సంగతులు. కనీసం నాని తర్వాత రేంజ్ లో కూడా మిగలడు అనేది ఇండస్ట్రీలోని కొందరు పెద్దలు అనుకుంటోన్న మాట.

Vijay Devarakonda Neglects WFL Producer,Vijay Fighter,Puri Fighter,Vijay Pan India Movie

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article