విజయ్, విశ్వక్ సేన్ హీరోలుగా విక్రమ్ వేద

Vijay Devarakonda Vishwaksen Multistarrer Movie

2018లో స్తబ్ధుగా ఉన్న కోలీవుడ్ మార్కెట్ కు ఊపు తెచ్చిన సినిమా ‘విక్రమ్ వేద’. విజయ్ సేతుపతి, మాధవన్ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ అక్కడ సూపర్ హిట్ గా నిలిచింది. విజయ్ సేతుపతి గ్యాంగ్ స్టర్ గా, మాధవన్ పోలీస్ ఆఫీసర్ గా నటించారు. ఈ రెండు పాత్రల్లో పోటీ మరీ నటించారు. ఒకరకంగా చెబితే మాస్ మూవీ అంటే ఇదిరా అనిపించేలా ఉంటుందా సినిమా. అందుకే చాలా భాషల్లో రీమేక్ రైట్స్ తీసుకున్నారు చాలామంది. తెలుగులో కూడా రీమేక్ అల్లు అరవింద్ రీమేక్ రైట్స్ తీసుకున్నాడు. అప్పట్లో ఇద్దరు మెగా హీరోలతో చేయాలనుకున్నారు కుదర్లేదు. ఇప్పుడు మెగా హీరోలెవరూ ఖాళీగాలేరు. అయితే రీసెంట్ గా అరవింద్ స్టార్ట్ చేసిన డిజిటల్ స్ట్రీమింగ్ ‘ఆహా’యాప్ ఓపెనింగ్ సందర్భంగా అరవింద్.. విజయ్ దేవరకొండతో మరో సినిమా చేయబోతున్నట్టు చెప్పాడు. అది ఈ సినిమానే అని లేటెస్ట్ న్యూస్.

విజయ్ దేవరకొండ ఇమేజ్ ను ఫాలో అవుతున్నాడా అనిపించేలా విశ్వక్ సేన్ యాటిట్యూడ్ కనిపిస్తుంది. ఇద్దరూ తెలంగాణ పోరలే. వైవిధ్యమైన సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు. నటులుగా కూడా ప్రూవ్ చేసుకున్నారు. అందుకే ఈ ఇద్దరితో విక్రమ్ వేద రీమేక్ చేయాలనే ప్లాన్ లో ఉందట గీతా ఆర్ట్స్ బ్యానర్. విజయ్ దేవరకొండను విజయ్ సేతుపతి పాత్రలో.. విశ్వక్ ను పోలీస్ గా చేయించాలనుకుంటున్నారట. మరి ఈ వార్తలో నిజమెంత అనేది చెప్పలేం కానీ.. ఈ ఇద్దరూ కలిసి నటిస్తే మాత్రం ఖచ్చితంగా తెలుగులో అది క్రేజీయొస్ట్ ప్రాజెక్ట్ అవుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు

Vijay Devarakonda Vishwaksen Multistarrer Movie,Vikram Vedha Remake In Telugu,#Vijay Sethupathi,#Madhavan

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article