ఫోర్బ్స్ జాబితాలో స్థానంపై విజయ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

Vijay Devarkonda Interesting tweets

టాలీవుడ్ లో వరుస బ్లాక్ బస్టర్ సినిమాలను అందుకుంటూ స్టార్ హీరో గా మారడానికి రెడి అవుతున్న టాలీవుడ్ సెన్సాషల్ హీరో విజయ్ దేవరకొండ ప్రముఖ పత్రిక ఫోర్బ్స్ తన ఇండియా ఎడిషన్ లో ప్రకటించిన టాప్ 30 లిస్ట్ లో చోటు దక్కించుకున్నాడు. యువ పారిశ్రామిక వేత్తలు ఎవరైతే కొత్త శిఖరాలకు చేరుకున్నారో వాళ్ళను ఎంచుకునే ఫోర్బ్స్ అందులో 29వ స్థానాన్ని విజయ్ దేవరకొండకు ఇచ్చింది. ఎంటర్ టైన్మెంట్ మరియు మ్యూజిక్ క్యాటగిరీలో విజయ్ కు ఈ ఘనతను దక్కింది. ఒకవైపు హీరోగా ‘పెళ్లి చూపులు’, ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’, ‘టాక్సీవాల’ లాంటి హిట్ లు నమోదు చేసుకోవడమే కాక మరొక వైపు విజయ్ దేవరకొండ ‘కింగ్ ఆఫ్ ది హిల్’ అనే బ్యానర్ తో నిర్మాతగా కూడా మారనున్నాడు. ఇవే కాక రౌడీ వేర్ అనే బట్టల బ్రాండ్ కూడా స్థాపించాడు ఈ యువ హీరో. అందుకే ఇపుడు ఫోర్బ్స్ జాబితాలో చేరిపోయాడు. ఇక సినిమాల పరంగా ప్రస్తుతం ‘డియర్ కామ్రేడ్’ సినిమా లో స్టూడెంట్ లీడర్ గా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటిస్తున్న విజయ్ దేవరకొండ చేతిలో మరో మూడు ప్రాజెక్ట్స్ ఉండడం విశేషం. ఈ సందర్భంగా విజయ్ చేసిన ట్వీట్ ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే.. నాకు 25 ఇయర్స్ అప్పుడు, నా ఆంధ్రాబ్యాంక్ అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ రూ.500లు మెయిన్‌టెన్ చెయ్యలేదని నా అకౌంట్ లాక్ చేసారు.
అప్పుడు మా నాన్న.. 30 ఇయర్స్ వచ్చేలోపే సెటిల్ అవ్వాలి.. పేరెంట్స్ హెల్దీగా ఉన్నప్పుడు, నువ్వు యువకుడిగా ఉన్నప్పుడే సక్సెస్‌ని ఎంజాయ్ చెయ్యగలవని చెప్పారు. కట్ చేస్తే, నాలుగేళ్ళ తర్వాత 2019 ఫోర్బ్స్ ఇండియా ’30 అండర్ 30′ లో ప్లేస్ పొందాను.. అంటూ, భావోద్వేగంతో ట్వీట్ చేసాడు విజయ్ దేవరకొండ. విజయ్ ట్వీట్‌ని అతని అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

Subscribe to YT|Tsnews.tv

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article