సిద్దార్థ పరిస్థితి తన పరిస్థితి సేమ్ అని ట్వీట్ చేసిన విజయ్ మాల్యా

VIJAY MALLYA TWITTER MY SITUATION DIRECTLY RELATED TO SIDDHARTH

మంచి వ్యక్తిత్వం, తెలివైన వ్యాపారవేత్త ‘కాఫీ డే’ సిద్థార్థ మృతి ఘటన ప్రభుత్వ ఏజెన్సీలు, బ్యాంకుల వేధింపులకు ఓ ఉదాహరణ అని, తనను కూడా అలాగే వేధిస్తున్నారని వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న విజయ్‌మాల్యా ఆరోపించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో తన అభిప్రాయాన్ని పోస్టు చేశారు. వేలాది కోట్ల మొత్తాల్ని బ్యాంకుల వద్ద అప్పుగా తీసుకొని.. తన దారిన తాను విదేశాలకు చెక్కేసిన వ్యాపార ప్రముఖుడు ప్రముఖ లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా తనను సిద్దార్దతో పోల్చుకున్నారు.. బ్యాంకులకు కట్టాల్సిన అప్పుల్ని కట్టకుండా తన దారిన తాను బ్రిటన్ వెళ్లిపోయి.. విలాసవంతమైన భవనంలో ఉన్న ఆయన..గడిచిన కొద్దికాలం బ్యాంకులకు తాను చెల్లించాల్సిన అప్పుల్ని కట్టేస్తానని చెబుతున్నారు. తాను తీసుకున్న రుణాల్ని తిరిగి చెల్లిస్తానని చెప్పినా.. బ్యాంకుల నుంచి సానుకూలంగా స్పందించటం లేదని ఆయనీ మధ్యన వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా కేఫ్ కాఫీడే సీఎండీ కమ్ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి అల్లుడు వీజీ సిద్దార్థ ఆత్మహత్య చేసుకున్న వైనాన్ని తనతో రిలేట్ చేసుకున్నారు మాల్యా. ప్రస్తుతం తనది కూడా సిద్దార్థ పరిస్థితేనంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

తనకు సిద్దార్థకు పరోక్ష సంబంధం ఉందన్న మాల్యా.. ఆయన్ను తెగ పొగిడేశారు. అద్భుతమైన మనిషి అని.. ప్రజ్ఞావంతుడైన పారిశ్రామికవేత్తగా పొగిడేశారు. ఆయన రాసిన లేఖ మనసును కలిచివేశాయని.. బ్యాంకులు.. విచారణ సంస్థలు ఎలాంటి వ్యక్తినైనా నిరాశ.. నిస్పృహలోకి నెట్టగలవన్నారు. తాను తీసుకున్న అప్పును పూర్తిగా చెల్లిస్తానని చెప్పినా.. ప్రభుత్వం నుంచి.. బ్యాంకుల నుంచి సానుకూల స్పందన రావట్లేదన్నారు. తన పట్ల ఎంత దారుణంగా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో చూడొచ్చాన్నారు. విదేశాల్లోని ప్రభుత్వాలు.. బ్యాంకులు.. అప్పు తీసుకున్న వారు తిరిగి చెల్లిస్తానంటే అండగా నిలుస్తాయని.. వారికి స్థైర్యాన్ని కలుగజేస్తాయని.. అందుకు భిన్నంగా భారత ప్రభుత్వం.. బ్యాంకులు వ్యవహరిస్తున్నాయంటూ మండిపడ్డారు. టైం చూసుకొని మరీ.. అందరికి టచ్ అయ్యేలా చేసిన ట్వీట్ ఇప్పుడు అందరి చూపు మాల్యా మీద పడేలా చేసిందని చెప్పాలి.

BREAKING NEWS

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article