శ్రీలీల… శ్రీలీల… శ్రీలీల. టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ విన్నా అదే పేరే. ఇప్పటికే అరడజనుపైగా ప్రాజెక్టులతో యమా బిజీగా ఉన్న ఈ తెలుగు అందం కోసం మరిన్ని అవకాశాలు క్యూ కడుతున్నాయి. యువ హీరోలు మొదలుకొని.. స్టార్ హీరోల వరకూ ఎవరి పక్కన చూసినా ఈమెనే. వచ్చే రెండు మూడేళ్లు వెండితెరపై శ్రీలీల సందడే ఎక్కువగా కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఈమె విజయ్ దేవరకొండతో జోడీ కట్టే అవకాశాన్ని చేజిక్కించుకున్నట్టు సమాచారం.
విజయ్ కథానాయకుడిగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. విజయ్ ఇందులో ఓ గూఢచారిగా పోలీస్ అదికారి పాత్రలో కనిపించనున్నారు.ఆయన సరసన శ్రీలీల కథానాయికగా ఎంపికైనట్టు సమాచారం.విజయ్‌కి జోడీగా ఎవరు నటించినా కెమిస్ట్రీ అదిరిపోతుంది.ఇక కుర్ర భామ శ్రీలీల నటిస్తుందనగానే ఆ అంచనాలు మరింతగా పెరిగిపోతున్నాయి. ఈ జోడీ ఏ రేంజ్‌లో సందడి చేస్తుందో చూడాలి.