విశాఖపట్నం:దేశంలో అణగారిన వెనుకబడిన కులా లు ఏమైనా ఉన్నాయి అంటే అది కేవలం ఎస్సీ ఎస్టీలు మాత్రమే నని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల వారిని మిగిలిన కులాల తో సమాంత రంగా అభివృద్ధి చేసేందుకు చేపట్టిన ఏ కార్యక్రమమైనా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందని తెలిపారు.విశాఖ బీచ్ రోడ్ లోని కోస్టల్ బ్యాటరీ దగ్గర ఉన్న జాలరి పేట గంగమ్మ తల్లి గుడి వద్ద రాజ్యసభసభ్యుడు విజయసాయి రెడ్డి పర్యటించారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక మత్స్యకారుల కోరికమేరకు పోలమాంబ, కొత్త మాంబ, భూలోక మామ దేవాలయాలు నిర్మాణం చేపట్ట డం జరిగిందన్నారు.సుమారు తొమ్మి ది నెలల గడువులోగా దేవాలయం నిర్మాణం పూర్తి చేయడం జరుగుతుం దన్నారు. దేవాలయం నిర్మాణం తమిళనాడు శిల్పులు తో చేయించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా సింహాచలం కొండ చుట్టూ రక్షణ గోడ నిర్మాణం త్వరలో ప్రారంభం అవుతుందని తెలిపారు.