ప్రముఖ నటి, దర్శకురాలు విజయ నిర్మల కన్నుమూత

Spread the love

VIJAYA NIRMALA EXPIRED

  • అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస

ప్రముఖ నటి, దర్శకురాలు, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం రాత్రి హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. హీరో కృష్ణ విజయ నిర్మల దర్శకత్వం వహించిన అత్యధిక చిత్రాల్లో నటించారు. 1946 ఫిబ్రవరి 20న జన్మించిన విజయ నిర్మల అసలు పేరు నిర్మల. పాండురంగ మహత్యం చిత్రంలో బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసిన ఆమె.. రంగులరాట్నం సినిమాలో కథానాయికగా నటించారు. మీనా అనే సినిమాకు దర్శకత్వం వహించడం ద్వారా తొలి తెలుగు మహిళా దర్శకురాలిగా పేరు సంపాదించారు. అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు (44) దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలిగా ఆమె పేరు 2002లో గిన్నిస్ బుక్ లో నమోదైంది. 1971లో మీనా చిత్రం నుంచి ప్రారంభమైన ఆమె ప్రస్థానం.. 2009లో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన నేరము-శిక్ష వరకు కొనసాగింది. దేవదాసు, దేవుడే గెలిచాడు, రౌడీ రంగమ్మ, మూడు పువ్వులు ఆరు కాయలు, హేమా హేమీలు, రామ్‌ రాబర్ట్‌ రహీం, సిరిమల్లె నవ్వింది, భోగి మంటలు, బెజవాడ బెబ్బులి, ముఖ్యమంత్రి, లంకె బిందెలు, కలెక్టర్‌ విజయ, ప్రజల మనిషి, మొగుడు పెళ్లాల దొంగాట, పుట్టింటి గౌరవం, రెండు కుటుంబాల కథ వంటి విజయవంతమైన చిత్రాలకు ఆమె దర్శకత్వం వహించారు.

BREAKING NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *