చంద్రబాబు , పవన్ లకు లింక్ పెట్టి విజయసాయి ఆసక్తికర వ్యాఖ్యలు 

VIJAYA SAI HOT COMMENTS ON CHANDRA BAABU AND PAVAN

రాజధాని రైతులు రాజధాని తరలింపు  వివాదం నేపథ్యంలో ఆందోళన బాట పట్టారు.  జనసేన  అధినేత పవన్ కళ్యాణ్ ని కలిసి తమ గోడు విన్నవించుకున్నారు.  రైతుల సమస్యలు తెలుసుకున్న పవన్ కళ్యాణ్  అమరావతి ప్రాంత రైతులకు అండగా ఉంటానని  హామీ ఇచ్చారు.  అంతేకాదు  ఈనెల 30, 31 తేదీల్లో  రాజధాని ప్రాంతంలో పర్యటిస్తానని చెప్పారు.
అంతేకాదు  అమరావతి  విషయంలో  జగన్ సర్కారు తీరుపై  విరుచుకుపడ్డారు పవన్ కళ్యాణ్.  ప్రతీది వ్యక్తిగతంగా చూడకూడదని జగన్ కి  హితవు పలికిన  పవన్ కళ్యాణ్  గత పాలకులు  అవకతవకలకు పాల్పడి ఉంటే  వాటిని సరిదిద్దుకుని ముందుకు పోవాలి తప్ప,  ఇలా పూర్తిగా ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించటం  కరెక్ట్ కాదన్నారు.  రాజధాని అమరావతి నుంచి తరలించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.  రాజధాని సమస్య ఒక ప్రాంత సమస్య కాదని,  రాష్ట్రం అంతటికి ఈ సమస్యని చెప్పిన పవన్ కళ్యాణ్ రాజధాని రైతులకు అండగా ఉంటానని  హామీ ఇచ్చారు.  ఎట్టిపరిస్థితిలోనూ రాజధాని తరలింపును ఒప్పుకో బోమని  తేల్చిచెప్పారు
ఇక రాజధాని విషయంలో పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు పై వైసిపి నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి తనదైన శైలిలో సెటైర్లు వేశారు.  పవన్ పేరు ప్రస్తావించకుండా పవన్ ను ఘాటుగానే విమర్శించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేరు చెప్పకుండా, ఆయన అమరావతిపై తన వైఖరిని మార్చుకున్నారని రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి  పేర్కొన్నారు. “చంద్రబాబు ‘అజ్ఞాత పార్ట్‌నర్‌’ కూడా యూటర్నుల మాస్టర్‌ అయిపోయారని  ఆయన మండిపడ్డారు.  ఇక అందుకు కారణాలు కూడా చెప్పిన విజయసాయి  గత ప్రభుత్వ హయాంలో నాడు అమరావతి ప్రజా రాజధాని కాదు, టీడీపీ రాజధాని అని గర్జించిన వ్యక్తి ఇప్పుడు రాజధానిని అక్కడి నుంచి మారిస్తే ఒప్పుకునేది లేదంటున్నారు  అంటూ  నాడు  పవన్ మాట్లాడిన మాటలను గుర్తు చేశారు.  ఇక అంతే కాదు మాటపై నిలబడలేని వారు రాజకీయాలను ఏం మారుస్తారు?” అని  ఎద్దేవా చేశారు  విజయ్ సాయి రెడ్డి.
మొత్తానికి  వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి  అటు బీజేపీని,  టిడిపిని మాత్రమే కాకుండా  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ గా చేసుకొని వ్యాఖ్యలు చేయడం, సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెట్టడం చర్చనీయాంశం అవుతుంది. గతంలో పదేపదే చంద్రబాబు అజ్ఞాత   పార్టనర్ అంటూ  వ్యాఖ్యలు చేసి  జనసేనానిని  ఇబ్బంది పెట్టిన వైసిపి నేతలు ఇక రాజధాని అమరావతి విషయంలో మరోసారి పవన్ కళ్యాణ్ ను,  చంద్రబాబును కలిపి లింక్ పెట్టి చేసిన పోస్ట్ పై చర్చ జరుగుతుంది.

VIJAYASAI LATEST COMMENTS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article