టీడీపీ నేతలను ముంపు గ్రామాల్లోకి రానివ్వొద్దు అన్న  విజయసాయి.. 

Vijayasai says not to let the TDP leaders come to the villages

సోషల్ మీడియా సాక్షిగా అటు టీడీపీ మరియు వైసీపీ పార్టీల నడుమ పెద్ద ఎత్తున రచ్చ నడుస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇక వరదల వల్ల ముంపుకు గురైన చోట్ల ప్రజల మద్దతు కోసం కూడా నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. చెయ్యాల్సిన సహాయం అటుంచి మాటల తూటాలు పేలుస్తున్నారు.  గోదావరి జిల్లాల్లో ముంపు గ్రామాలలో పరిస్థితి పర్యవేక్షించేందుకు నారా లోకేష్ వెళ్ళిన సంగతి తెలిసిందే . ఇక ఈ నేపధ్యంలో విజయ సాయి లోకేష్ పై ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ఇక చంద్రబాబు, టీడీపీ నేతలను ఎవరినీ ముంపు గ్రామాల్లోకి రానివ్వొద్దని అయన కోరారు.
ప్రస్తుతం పోలవరం ఎగువన ముంపు ప్రాంతాలను వైసీపీ అధినేత మరియు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ నిన్ననే ఏరియల్ సర్వే కూడా చేసారు.ఈ ముంపు ప్రాంతాలకు కానీ టీడీపీ నేతలు వస్తే రానివ్వద్దని దీనంతటికి కారణం వారే అని విజయసాయి రెడ్డి “పోలవరం ఎగువన ముంపు గ్రామాలకు తెలుగుదేశం నాయకులు పరామర్శకు వస్తే అడ్డుకోవాలి. ఎలక్షన్ల ముందు ప్రజలను మభ్యపెట్టడానికి కాఫర్‌ డ్యామ్‌ నిర్మించడం వల్లే ప్రవాహం వెనక్కి తన్ని గ్రామాలు మునిగాయి. చంద్రబాబు క్షమాపణ చెప్పేంత వరకు టీడీపీ నాయకులను అడుగు పెట్టనివ్వొద్దు.” అంటూ ట్వీట్ పెట్టారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article